మతం పేరుతో.. పురుషుల ప్యాంటు జిప్‌ తీసి.. చూసి మరీ చంపారు.. సంచలన వీడియో బయటకు

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఆ భయంకర షాక్ నుంచి ఒక్కొక్కరి స్టోరీస్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ఉగ్రవాదులు ఏ విధంగా తమ కుటుంబ సభ్యులను మతం అడిగి, బట్టలు విప్పి చూసి, కల్మా చదవడం వచ్చా అని అడిగి చంపేశారో తెలిపారు. మరికొంత మంది మాత్రం ఇంకా ఆ షాక్ లోనే ఉన్నారు.

కేవలం హిందువులు, పురుషులే టార్గెట్ గా ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అనుమానం వచ్చిన ప్రతి బాధితుడి ప్యాంటు జిప్ తీసి.. చూసి మరీ అక్కడికక్కడే కాల్చేశారు. ఈ హృదయవిషాదకరమైన దృశ్యాలు గల ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉగ్రవాదులు హిందువుల తలపై నేరుగా గురిపెట్టి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Pahalgam Terror Attack Terrorists Target and Kill Only Hindus

మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని, ఒక్కొక్కరినీ గుర్తించి మరీ కాల్చి చంపినట్లుగా ఈ వీడియోలో ఉంది. మృతి చెందిన వారిలో చాలా మంది పురుషుల ప్యాంటు జిప్‌లు తీయడం.. లేదా వారి ప్యాంట్లు క్రిందికి లాగి ఉండటం అధికారులకు కనిపించింది. కల్మా చదవమని బలవంతం చేయడం, సున్నతి ఉందో లేదో తనిఖీ చేయడం వంటి దారుణమైన చర్యలకు కూడా ఉగ్రవాదులు పాల్పడ్డారు.

అయితే పహల్గాం ఉగ్రదాడిలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అనంత్ నాగ్ జిల్లాలోని బైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకెళ్లిన అయాజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్ముకశ్మీర్ లోని గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయాజ్ అహ్మద్ ఓ మహిళా టూరిస్టును మతం అడిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక అనేక మంది టూరిస్టులకు మాయ మాటలు చెప్పి మరీ లొకేషన్స్ బాగుంటాయని పహల్గాం తీసుకెళ్లినట్లు తేలింది. ప్రస్తుతం ఇతడ్ని పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+