గురుదాస్‌పూర్: పాక్ చొరబాటుదారుడ్ని హతమార్చిన బీఎస్ఎఫ్
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సెక్టార్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా సిబ్బంది అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.
అమృత్‌సర్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సెక్టార్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. అప్రమత్తమైన సరిహద్దు భద్రతా సిబ్బంది అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.
భారత్-పాక్ సరిహద్దు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం భద్రతా సిబ్బంది గమనించారు. భద్రతా బలగాలు హెచ్చరించినప్పటికీ.. ఆ వ్యక్తి పట్టించుకోకుండా భారత భూభాగం వైపు చొరబడ్డాడు. దీంతో జవాన్లు అతడిపై కాల్పులు జరిపి హతమార్చారు.

ఉగ్ర చొరబాటు నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత జనవరిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉగ్రవాదులు పంజాబ్‌లోని సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications