బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Pakistan lady: ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకుని జల్సా, 8 ఏళ్లకు కిలాడి చిక్కింది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బట్కల్: మనోళ్లు ఎంత మేధావులు అంటే మాటల్లో చెప్పలేము. పుట్టి పెరిగిన ఊర్లో రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకోవాలంటే అనేక రూల్స్ అడుగుతారు, దానికితోడు వీడు మనోడేనా ?, వీడు మన కులం వాడేనా ?, వీడు మన పార్టీ వాడేనా అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకోవాలంటే వాడిచావు వాడు చావాల్సిందే అనే ఆరోపణలు ఉన్నాయి. టైమ్ బాగాలేక ఎవరైనా ప్రశ్నిస్తే వాడికి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తారు. అయితే ఇలాంటి కష్టాలు ఏమీ లేకుండా పాకిస్థాన్ మహిళ భారతదేశానికి చెందిన అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకునింది. మన దాయాది దేశానికి చెందిన మహిళకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, చివరికి బర్త్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకున్న కిలాడీ లేడీ కొన్ని సంవత్సరాల తరువాత అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి అనే సామెతలాగా ఈ పాకిస్థాన్ మహిళ కథ ఆసక్తికరంగా మారింది.

Illegal affair: భర్త జైల్లో, భార్య, ప్రియుడు 24 x7, ఫోన్లో మ్యాటర్ లీక్ చేసిన కూతుర్లు !Illegal affair: భర్త జైల్లో, భార్య, ప్రియుడు 24 x7, ఫోన్లో మ్యాటర్ లీక్ చేసిన కూతుర్లు !

రేయ్....... వీడు మనోడేనా ?

రేయ్....... వీడు మనోడేనా ?


పుట్టి పెరిగిన ఊర్లో రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకోవాలంటే అనేక రూల్స్ అడుగుతారు, దానికితోడు వీడు మనోడేనా ?, వీడు మన కులం వాడేనా ?, వీడు మన పార్టీ వాడేనా అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగి రేషన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకోవాలంటే వాడిచావు వాడు చావాల్సిందే అనే ఆరోపణలు ఉన్నాయి.

ఉగ్రవాదులకు పుట్టిన ఊరు

ఉగ్రవాదులకు పుట్టిన ఊరు

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కారవార సమీపంలోని బట్కల్ పేరు చెబితో ఉగ్రవాదుల కేంద్ర బిందువు అనే విషయం తెలిసిందే. బట్కల్ కు చెందిన రియాజ్ బట్కల్, యాసీన్ బట్కల్ సోదరులు పేరు మోసిన ఉగ్రవాదులు. బట్కల్ సోదరుల మీద దేశవ్యాప్తంగా అనేక దేశద్రోహం కేసులు నమోదు అయ్యాయి. అమెరికా హిట్ లిస్టులో కూడా బట్కల్ సోదరుల పేర్లు ఉన్నాయి.

పాకిస్థాన్ మెహరీన్ కు అన్నీ ఉన్నాయి

పాకిస్థాన్ మెహరీన్ కు అన్నీ ఉన్నాయి

బట్కల్ లో పాకిస్థాన్ కు చెందిన ఖతీజా మెహరీన్ అనే మహిళ అక్రమంగా నివాసం ఉంటున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు మెహరీన్ ను అరెస్టు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి బట్కల్ లోని నవాయత్ కాలనీలో మెహరీన్ నివాసం ఉంటున్నా ఆమె పాకిస్థాన్ మహిళ అనే విషయం పోలీసులు కాని, స్థానికులు కానీ గుర్తించలేకపోయారు.

పక్కాప్లాన్ తో ప్రభుత్వ గుర్తింపు కార్డులు

పక్కాప్లాన్ తో ప్రభుత్వ గుర్తింపు కార్డులు

మన దాయాది దేశం (పాకిస్థాన్ )కు చెందిన మెహరీన్ అనే మహిళకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, చివరికి బర్త్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకున్న మెహరీన్ ను 8 సంత్సరాల తరువాత అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. భర్త జావెద్ మోహిద్దీన్ రుక్బుద్దీన్, ముగ్గురు పిల్లలతో కలిసి మెహరీన్ గుట్టుచప్పుడు కాకుండా నివాసం ఉంటోందని వెలుగు చూడటంతో స్థానికులు బిత్తరపోయారు.

పాకిస్థాన్ టూ దుబాయ్, భారత్ లోకి అక్రమంగా ఎంట్రీ

పాకిస్థాన్ టూ దుబాయ్, భారత్ లోకి అక్రమంగా ఎంట్రీ

దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జావీద్ మెహరీన్ ను అక్కడే వివాహం చేసుకున్నాడు. టూరిస్టు వీసాతో 2014లో మూడు నెలల పాటు పర్యటించడానికి అనుమతి తీసుకున్న మెహరీన్ బట్కల్ కు వచ్చింది. మూడు నెలల తరువాత దుబాయ్ వెళ్లిపోయిన పాకిస్థాన్ జాతీయురాలు తరువాత అక్రమ మార్గంలో భారత్ చేరుకుని అక్రమంగా బట్కల్ లో నివాసం ఉంటున్నదని పోలీసు అధికారులు అంటున్నారు.

ఏమైనా స్కెచ్ వేసిందా ?

ఏమైనా స్కెచ్ వేసిందా ?

పాకిస్థాన్ మహిళ బట్కల్ లో నివాసం ఉంటున్నదని కొన్ని నెలల ముందే ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. మెహరీన్ మీద కొన్ని నెలల పాటు నిఘా వేసిన పోలీసులు చివరికి అమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. పాకిస్థాన్ కు చెందిన మహిళ బట్కల్ లో పుట్టిపెరిగినట్లు అక్కడి మునిసిపాలిటీలో బర్త్ సర్టిఫికెట తీసుకునిందని పోలీసులు గుర్తించారు. మెహరీన్ కు అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయి ?, ఎవరు ఇచ్చారు ? అంటూ ఆరా తీస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ బద్రీనాథ్ మీడియాకు చెప్పారు.

English summary
Pakistan lady: Pakistani woman arrested in Uttara Kannada district Bhatkal who living in Karnataka from 8 years without visa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X