మేం దాడి చేసేలోపే.. బ్రహ్మోస్ తో దెబ్బ కొట్టారు - పాక్ ప్రధాని అంగీకారం, వేడుకోలు..!!
ఆపరేషన్ సింధూర్ లో తాము ఘోరంగా దెబ్బ తిన్నామని పాక్ ప్రధాని అంగీకరించారు. కోలుకో లేని విధంగా భారత్ తమను దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చారు. తాము భారత్ పైన దాడికి సిద్దం అవుతున్న సమయంలోనే బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడిందని అంగీకరించారు. భారత్ దాడిలో తమ వైమానిక స్థావరాలు నష్టపోయామని వెల్లడించారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్ ను అభ్యర్ధించారు. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఏ విధంగా నష్టపోయిందో ప్రపంచ దేశాలకు అర్దం అవుతోంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో మే 10న తెల్లవారుజామున భారత్‌పై దాడికి సిద్ధమయ్యామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇందు కోసం తొమ్మిదో తేదీ రాత్రే వ్యూహ రచన చేశా మని వివరించారు. అయితే, తమ కంటే ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడిందని చెప్పారు. బ్రహ్మోస్ ధాటికి తమ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని తొలి సారి అంగీకరించారు. పాకి స్థాన్-తుర్కియే-అజర్‌బైజన్ మధ్య అజర్‌బైజన్ వేదికగాజరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్‌పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆ లోపే భారత్ దాడి చేసిందని తెలిపారు.

భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం, నాలుగున్నర గంటలకు దాడి చేసి శత్రువు(భారత్)కు పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ, దాని కంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసిందని వివరించారు. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించిందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్ష ల్ ఆసిమ్ మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక, ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటివాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడు కుందా మని పాక్ ప్రధాని మరోమారు భారత్‌ను కోరారు. శాంతి కోసం ఇరుదేశాలు మాట్లాడుకోవాల ని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications