• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్ కుతంత్రం:భారత సైన్యంపైకి టెర్రరిస్టులు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీని ఎదుర్కొనేందుకు గాను పాకిస్ధాన్ మిలిటెంట్ గ్రూపులను ప్రతినిధులుగా ఉపయోగిస్తుందంటూ పెంటగాన్.. అమెరికన్ కాంగ్రెసుకు తెలిపింది. ఆఫ్ఘన్-భారతీయ దృష్టి తీవ్రవాదులు వారి కార్యకలాపాలను పాకిస్ధాన్ భూభాగం నుండి కొనసాగస్తున్నారని సమర్పించిన 100 పేజీల నివేదికలో పేర్కొంది.

ఆఫ్ఘనిస్ధాన్‌లో కొల్పోయిన పట్టు.. ఇండియన్ సుపిరియర్ మిలిటరీకు కౌంటర్ ఇచ్చేందుకు పాకిస్ధాన్ తీవ్రవాద గ్రూపులను ప్రతినిధులుగా ఉపయోగిస్తుందంటూ ఆఫ్ఘనిస్ధాన్‌లో గత ఆరు నెలలుగా రూపొందించిన నివేదకను అమెరికా కాంగ్రెసుకు అందజేసింది.

ఆఫ్ఘనిస్ధాన్ - పాకిస్ధాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ గ్రూప్ ప్రతినిధులే కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. నరేంద్రమోడీ ప్రధానిమంత్రిగా బాధ్యతులు చేపట్టడానికి ముందే హెరాత్‌లో ఉన్న ఇండియన్ విదేశాంగ శాఖ భవనంపై దాడి చేసిన ఘటనను చూపించింది.

Pak using militants as proxies to counter Indian Army: Pentagon

నివేదిక రూపొందించే సమయంలో హెరాత్‌లో ఉన్న ఇండియన్ విదేశాంగ భవనంపై నలుగురు తీవ్రవాద మిలిటెంట్లు దాడి చేసిన సంఘటనను నివేదికలో పొందుపరిచింది. నరేంద్రమోడీ హిందూత్వ సంస్ధలకు అత్యంత సన్నిహితుడు అవడం వల్ల.. ఈ దాడి కాబోయే ప్రధాని మోడీకి ఒక హెచ్చరికగా ఉంటుందని సరిగ్గా మూడు రోజుల మందు దాడి చేశారని పేర్కొంది.

ఈ దాడికి కారణం తీవ్రవాద సంస్ధ లష్కరే తోయిబానేనని జూన్‌లో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. ఐతే ఈ దాడి తర్వాత మాజీ ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు కర్జాయ్‌ను భారతదేశ సంబంధాల మద్దతుపై బలమైన ప్రకటనలు చేసేలా చేశాయని తెలిపింది.

ఈ సంఘటన తర్వాత కూడా భారత్ ఆఫ్గనిస్తాన్‌కి తన మద్దతు కొనసాగిస్తుందని... అలా చేయడం వల్ల మధ్య ఆసియాలో సురక్షితమైన, స్థిరమైన ఆర్ధిక కారిడార్లకు ప్రయోజనం చేకూరుతుందని పెంటగాన్.. అమెరికా కాంగ్రెస్‌కు సూచించింది.

2011వ సంవత్సరంలో భారతదేశం, ఆఫ్గనిస్తాన్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటనకు సంతకం చేసిన సందర్భాన్ని గుర్తు చేసింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఆప్గనిస్ధాన్‌లో ఆర్థిక, వాణిజ్య, విద్య, ప్రజా పరిపాలన, భద్రతా మరియు చట్ట అమలుకు భారత్ సహాయం చేస్తుందన్నమాట.

ఆఫ్ఘనిస్ధాన్‌లో భారీ ప్రాజెక్టులకు కూడా భారత్ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విద్యుత్, రవాణా, రోడ్లు, మైనింగ్ లాంటి ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల రెండు దేశాల మధ్య మంచి సంబంధాలను కొనసాగిస్తుంది.

వీటితో పాటు ఆఫ్గనిస్ధాన్‌ సెక్యూరిటీ కోసం ఆఫ్గనిస్ధాన్‌ సిబ్బందికి భారతదేశం భూబాగంలో శిక్షణను అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు భారతదేశ ప్రభుత్వం చేస్తుందని నివేదికలో పేర్కొంది. ఐతే ఆఫ్గనిస్ధాన్‌కు నేరుగా మిలిటరీ సపోర్ట్ కానీ.. ఆఫ్గనిస్ధాన్‌‌లో సిబ్బందికి ట్రైనింగ్‌లు నిర్వహించడం లేదని తెలిపింది.

English summary
In a blunt assessment of terrorist safe havens in Pakistan, the Pentagon has told the US Congress that the country is using militant groups as proxies to counter the superior Indian military.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X