వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు పోయేకాలం: 29 సార్లు కాల్పుల ఉల్లంఘన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ తన నీచపు బుద్ది చూపిస్తున్నది. పాక్ యథేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక స్థావరాలు లక్షంగా చేసుకుని కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.

పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్ దాడులు జరిపిన తరువాత పాకిస్థాన్ 29 సార్లు కాల్పులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి, నౌషెరా సెక్టార్ లో సోమవారం రాత్రి పాక్ కాల్పులు జరిపింది.

అప్రమత్తం అయిన భారత సైనికులు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడని ఆర్మీ అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే పాక్ రెండు సార్లు కాల్పులు జరిపింది.

 Pak violates ceasefire on 29 occasions across LoC

భారతదేశం సరిహద్దులోని కృష్ణగాటి, పూంఛ్, బల్లోయ్, పుల్వామా, ఫ్లాటాన్, గిగ్రియల్, నౌషెరా, మక్రీ, ఝూనగర్, రాజౌరీ తదితర ప్రాంతాల్లో పాక్ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసింది. పాక్ పదేపదే కాల్పులు జరపడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతుందని, తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని భారత సైనికులు అంటున్నారు.

English summary
Pakistani troops had fired on forward Indian posts along Mendhar, Krishnagati sector in Poonch district resulting in injuries to a jawan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X