పాకిస్థాన్ గగనతలంపై కొనసాగుతోన్న నిషేధం .. వరుసగా ఆరో రోజు ఎగురని విమానాలు
న్యూఢిల్లీ : వైమానిక దాడులు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పాకిస్థాన్ గగనతలంపై నిషేధం కొనసాగుతూనే ఉంది. తమ గగనతలంపై నిషేధం ఎత్తివేస్తామని ఆ దేశ వైమానిక దళ అధికారులు రోజూ చెబుతూనే ఉన్నారు. కానీ నిషేధం మాత్రం కొనసాగుతోంది.

27 నుంచి మూసివేత
వైమానిక దాడులతో నెలకొన్న ఉద్రిక్తతతో గత నెల 27 నుంచి పాకిస్థాన్ గగనతలం నుంచి విమానాలను నిషేధించారు. సోమవారం సేవలను పునరుద్ధరిస్తామని చెప్పి .. మళ్లీ మంగళవారానికి వాయిదావేశారు. మంగళవారం కూడా పునరుద్ధరించక .. బుధవారం తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీంతో గత ఆరు రోజుల నుంచి పాకిస్థాన్ గగనతలంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
కొన్ని ఎయిర్ పోర్ట్లకు అనుమతి
కరాచీ, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, లాహోర్, ఫైసలాబాద్ మధ్య మాత్రం కొన్ని విమాన సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. విమాన సేవలు నిలిపివేయడంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆరు రోజుల్లో న్యూఢిల్లీతోపాటు పాకిస్థాన్, అంతర్జాతీయంగా దాదాపు 700 విమాన సేవలను నిలిపివేసింది.












Click it and Unblock the Notifications