ఉగ్రదాడికి సూత్రధారి ఖలీద్ పై పాక్ సైన్యం పూల వర్షం.. ఇక వీడికి మూడింది..!
నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతుంది పాకిస్థాన్. ఓవైపు పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ కాశ్మీర్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ దొంగ ఏడుపు ఏడుస్తోంది. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు పాకిస్థాన్ నాటకాలు ఆడుతోందని నిఘా వర్గాలు మండిపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ సంచలన విషయం బయటకు వస్తోంది. ఈ పెహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి ఖలీద్ పై పాకిస్థాన్ సైన్యం పూల వర్షం కురిపించినట్లు కథనాలు వస్తున్నాయి.
ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ప్రకటించింది. అయితే TRF ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారి అని సమాచారం. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్ కు సైఫుల్ల్లా కసూరి అనే పేరు కూడా ఉంది. మనదేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతడి పేరు చర్చకు వచ్చింది.

తాజాగా పెహల్గాం దాడికి 2 నెలల క్రితం సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ లోని పంజాబ్ లో గల కంగన్ పూర్ కు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ పాకిస్థాన్ సైన్యానికి సంబంధించి పెద్ద బెటాలియన్ ఉంది. ఈ సమయంలోనే పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్.. జీహాదీ ప్రసంగం చేయడానికి ఖలీద్ ను ఆహ్వానించాడని సమాచారం. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఖలీద్ పై పాక్ కల్నల్ స్వయంగా పూలవర్షం కురిపించినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
అదే సమయంలో సైఫుల్లా ఖలీద్ అతడి ప్రసంగం పాక్ సైన్యాన్ని, టెర్రరిస్టులను ఉసిగొల్పేలా.. భారత సైన్యాన్ని రెచ్చగొట్టేలా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజా దాడికి పక్కాగా ప్లాన్ చేశారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఖలీద్ కాగా.. దాడి సమయంలో టీమ్ కు అసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం లో ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు తాజాగా విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా గా అధికారులు గుర్తించారు.
జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకలు మంగళవారం జరిపిన ఘాతుకానికి 28 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.












Click it and Unblock the Notifications