వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఖాన్‌కు ఝలక్, షరీఫ్‌కు వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళన

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ఇస్లామాబాద్‌లో రెండు నెలల పాటు ఎటువంటి రాజకీయ సభలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేదని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానికి వ్యతిరేకంగా నవంబర్‌ రెండో తేదీన ఇమ్రాన్ ఖాన్ ఆందోళన చేపట్టనున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ గురువారం ప్రకటనను విడుదల చేసింది. ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌లో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించతలపెట్టారు. ఈ నేపథ్యంలో ర్యాలీలపై నిషేధం విధించారు.

 Pakistan Bans Protest and Rallies in Islamabad for 2 Months

షరీఫ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు విదేశాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. షరీఫ్‌ కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక విషయాలను పార్లమెంట్‌లో వివరించడంతో పాటు, టెలివిజన్‌ ఛానెల్స్‌లో వచ్చిన ప్రసంగాల్లో ఆయన పలుమార్లు ప్రస్తావించారు. దీనికి సంబంధించిన కేసు నవంబర్‌ 1న పాక్‌ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.

పీవోకేలో ఆందోళనలు

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కావాలని నినదిస్తున్నారు. బ్లాక్‌ డే పేరుతో పలు చోట్ల భారీ నిరసనలు చేపట్టారు. షరీఫ్‌ దౌర్జన్యాలు సాగవని హెచ్చరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

English summary
Pakistan Bans Protest and Rallies in Islamabad for 2 Months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X