ఆపరేషన్ సిందూర్ తో భారత్ కు భార్య అయిన పాకిస్తాన్..? ఎలాగో చెప్పిన ఎంపీ ..!

కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలను కూల్చేసింది. అనంతరం లాహోర్ తో పాటు పలు నగరాల్లోని ఆయుధ రక్షణ వ్యవస్థల్ని సైతం ధ్వంసం చేసింది. అదే క్రమంలో కొన్ని నష్టాల్ని కూడా చవి చూసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పై నిన్న పార్లమెంట్ లో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో భాగంగా ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో గంభీరంగా చర్చ జరుగుతోంది. విపక్షాలు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై నిలదీస్తున్నాయి. కేంద్రం కూడా అంతే దీటుగా సమాధానాలు ఇస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్డీయే మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బేణివాల్ తన ప్రసంగం ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి భార్యగా మారిందని, దానిని మన దేశానికి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. దీంతో లోక్ సభలో అంతా షాకయ్యారు.

Pakistan become wife to india after operation sindoor mp bizarre remark in parliament

ఆపరేషన్ సిందూర్ పై సీరియస్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ బేణివాల్.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం పాకిస్తాన్ తలపై సింధూరం పెడుతున్నట్లు కనిపించిందని తెలిపారు. మీరు ఆపరేషన్‌ను సింధూర్ అని పిలిచారని, భారతదేశం పాకిస్తాన్ జుట్టుకు సిందూర్ వేస్తున్నట్లు అనిపించిందని బేణివాల్ కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఒక స్త్రీ తన భర్తను తన సిందూరంగా భావిస్తుందని, భారతదేశం పాకిస్తాన్‌కు సిందూర్ వేసింది, కాబట్టి పాకిస్తాన్ దాని భార్యగా మారిందన్నారు.

ఇప్పుడు భారత్ కు భార్య అయిన పాకిస్తాన్ కు వీడ్కోలు మిగిలి ఉందని, కాబట్టి వెళ్లి పాకిస్తాన్ ను మన ఇంటికి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. దీంతో సభలో నవ్వులు విరిసాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని ఆయన కోరారు. ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి పహల్గామ్‌లో పర్యాటకులపై ఎలా దాడి చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+