ఢిల్లీకి సమీపంలో భారీగా పాక్ అణ్వాయుధాలు, ఏం జరుగుతోంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియా లక్ష్యంగా పాకిస్థాన్ అణు ఆయుధాలను సమకూర్చుకొంటున్నట్టు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ ప్రకటించింది. పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఆ వెబ్‌సైట్ ప్రకటించింది.

దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసిన పాకిస్తాన్‌ వాటిని దాచేందుకు రహస్య ప్రదేశంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది.పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో ఈ సొరంగాన్ని నిర్మించబోతున్నారని తెలిపింది.

Pakistan building tunnels to store its nuclear weapons, just 750 km from Delhi

10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగిన మూడు సొరంగాలు పాకిస్తాన్‌ నిర్మాణాల్లో ఉంటాయని ఆ వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ ప్రదేశానికి లాంచర్లను తీసుకెళ్లేలా భారీ రోడ్లతో కలుపుతున్నట్లు వెల్లడించింది.

మియన్‌వాలీ పట్టణాన్ని స్థావరంగా ఎంచుకోవడం వెనుక పెద్ద ఆలోచన ఉందని పేర్కొంది. మియన్‌వాలీ నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు దూరం కేవలం 350 కిలోమీటర్లు.

అదే న్యూఢిల్లీకైతే 750 కిలోమీటర్లు.తక్కువ దూరంలో అణు ఆయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా శత్రువును చావుదెబ్బ కొట్టాలనే వ్యూహం పాకిస్తాన్‌ పన్నినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan is reported to have built up a stock of 140 nuclear weapons and is now building underground tunnels to store them, according to a report by WION.The site is reportedly in Mianwali, which is located 350-km from Amritsar and 750-km from New Delhi, the report added.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి