వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌: పిండి, రోటీ కోసం జనం మధ్య కొట్లాటలు - మరో నెల రోజుల్లో పరిస్థితి మరింతగా విషమిస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం

పాకిస్తాన్‌కు చెందిన చాలా వీడియో క్లిప్‌లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో చాలా మంది ప్రజలు పిండి, రోటి కోసం కొట్టుకుంటున్నారు.

పాకిస్తాన్‌లోని ఆర్థిక సంక్షోభ పరిస్థితులను, ఆకాశాన్ని అంటిన ద్రవ్యోల్బణాన్ని చూపించేందుకు సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్‌లను షేర్ చేశారు.

కేవలం ఈ వీడియోలు మాత్రమే కాక, వీటిపై స్పందించిన నిపుణుల కామెంట్లు కూడా వైరల్‌గా మారుతున్నాయి.

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు, డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముక్తదర్ ఖాన్ కూడా ఈ వీడియోలపై స్పందించారు.

''ఇప్పుడు పాకిస్తాన్‌ మీద భారత్ దాడి చేసి, నాశనం చేయగలదు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నటువంటి దారుణ ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో ఉన్నట్లయితే, మీరు ఇప్పటికే భారత్‌పై దాడి చేసి ఉండేవారు. కానీ, భారతీయ నేతలు చాలా గౌరవప్రదమైన నేతలు. పాకిస్తాన్ పరిస్థితులను భారత్ నాయకత్వం అవకాశంగా తీసుకోవాలనుకోవడం లేదు’’ అని ఆయన ఒక పాకిస్తాన్ జర్నలిస్టుతో వ్యాఖ్యానించారు.

ఒకవేళ పాకిస్తాన్‌ తరహా పరిస్థితులు భారత్‌లో ఉన్నట్లయితే, ఇండియాలో మనీ లేదని, ఆర్థిక వ్యవస్థ పడిపోతోందని, తమిళనాడు విడిపోతోందని, అస్సాం విభజనను కోరుకుంటోందని.. ఇప్పుడు మనం దాడి చేసి కశ్మీర్‌ను తీసుకోవచ్చని పాకిస్తాన్ దాడి చేసి ఉండేదని ఖాన్ అన్నారు.

https://twitter.com/DebashishHiTs/status/1612362451663880192?s=20&t=htqU2eHEVb3R7Jq1xu9oGA

''పాకిస్తాన్‌కు అమెరికా చేయగలిగిన సాయమంతా చేసింది. ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్‌పై ఆసక్తి లేదు. ఆ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. పాకిస్తాన్‌ను నమ్మే పరిస్థితి లేదు. ఈ ఏడాది పాకిస్తాన్ రెండు యుద్ధాలు చేయాల్సి ఉంది. ఒక యుద్ధం టీటీపీ (తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్)తో చేయాలి. టీటీపీ కొత్త మ్యాప్‌ను చూస్తే, అందులో పీఓకే కూడా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉంది. భారత్ ఈ ఇబ్బందులను మరింత పెంచాలనుకోవడం లేదు’’ అని పాకిస్తాన్ జర్నలిస్టు ఫకర్ యుసఫ్‌జాయ్‌తో ముక్తదర్ ఖాన్ పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకూ అందిన సాయం, రుణాల పట్ల సంతోషంగా ఉంది. నిజానికి వరదల బారి నుంచి కోలుకునేందుకు పాకిస్తాన్‌కు 900 కోట్ల డాలర్లకు పైగా సాయాన్ని అందిస్తామని జెనీవాలో సోమవారం జరిగిన దాతల సదస్సులో హామీ లభించింది.

పాకిస్తాన్‌ ఖజానా వేగంగా ఖాళీ అవుతున్న సమయంలో ఇది చాలా పెద్ద ఊరట. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కేవలం 450 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి.

ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా భారీగా అప్పులున్నాయి. హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం జెనీవా కాన్ఫరెన్స్ నుంచి 900 కోట్ల డాలర్ల సాయం పొందడాన్ని గొప్ప విజయం సాధించినట్టు చెప్పుకుంటోంది.

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం

https://twitter.com/Marriyum_A/status/1612433009134682112?s=20&t=ei2Ht-BC6eqPHtgSP7tDRQ

పాకిస్తాన్‌కు ఇప్పటికే ఇచ్చిన రుణాలను, పెట్టుబడులను పెంచుతామని సౌదీ అరేబియా సంకేతాలిచ్చింది. పాకిస్తాన్‌కి ఇచ్చిన 300 కోట్ల డాలర్ల రుణాలను 500 కోట్ల డాలర్లకు పెంచాలని సౌదీ అరేబియా భావిస్తోంది. అంతేకాక పెట్టుబడులను కూడా పెంచేందుకు చర్చలు జరుపుతోంది.

అలాగే, వచ్చే మూడేళ్లలో ప్రపంచంలోని ఇతర సంస్థల నుంచి పాకిస్తాన్‌కు 870 కోట్ల డాలర్ల సాయం అందుతుంది. అయితే ఈ మొత్తం రుణం రూపంలో వస్తుందా? లేదా గ్రాంట్ రూపంలో అందనుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు.

''ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ పాకిస్తాన్’ పేరుతో జెనీవాలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది.

ఐక్యరాజ్యసమితి ఈ సమావేశాన్ని నిర్వహించింది.

గత ఏడాది పాకిస్తాన్‌లో వచ్చిన వరదలతో లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు.

వరద బాధితులకు సాయం చేసేందుకు, ఈ కాన్ఫరెన్స్‌లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను ఆర్థించింది.

ఐక్యరాజ్యసమితి, పాకిస్తాన్ అభ్యర్థనల మేరకు చాలా ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు 900 కోట్ల డాలర్లకు పైగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం

విదేశీ మారకం నిల్వలు 450 కోట్ల డాలర్లు...

''వరదలతో ప్రభావితమైన పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు, జెనీవా కాన్ఫరెన్స్‌లో విజయవంతంగా 900 కోట్ల డాలర్లకు పైగా సేకరించగలుగుతున్నాం’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు.

ఈ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అంతర్జాతీయ కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల జరిగిన ఈ పరిణామాలపై జనవరి 11న పాకిస్తాన్ ప్రముఖ ఇంగ్లీష్ వార్తాపత్రిక డాన్ ఎడిటోరియల్‌ను ప్రచురించింది.

''ఇక్కడ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం దొరికిందని ప్రభుత్వ అధికారులు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ నిజమేమిటంటే పాకిస్తాన్‌లో డాలర్ కొరత ఇంకా ముగియలేదు’’ అని డాన్ తన ఎడిటోరియల్ కథనంలో రాసింది.

పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు ఎస్‌బీపీలో విదేశీ మారక నిల్వలు 450 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తం నాలుగు వారాల దిగుమతుల బిల్లు చెల్లించేందుకు సరిపోతుంది.

పాకిస్తాన్‌కు తక్షణమే డాలర్లు కావాల్సి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలను పాకిస్తాన్ తేల్చుకోకపోతే.. జెనీవా కాన్ఫరెన్స్, ఇతర సంస్థల నుంచి సాయం పొందడం కాస్త కష్టమేనని డాన్ పేర్కొంది.

ఆందోళనకర పరిస్థితి...

''ఐఎంఎఫ్ ఒప్పందం పొందడం కోసం ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేయకూడదని పాకిస్తాన్ ప్రధాన మంత్రి కోరుకుంటున్నారు. ఈ సంస్కరణలలో సింగిల్ మార్కెట్ ఆధారిత మారక రేటు, విద్యుత్ బిల్లులు, గ్యాస్ ధరలు పెంచడం, పన్నులు పెంచడం వంటివి ఉన్నాయి. ఈ రుణాలు, సాయాలు, ట్రస్టుల ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడతామని కాదు’’ అని డాన్ పేర్కొంది.

జెనీవా కాన్ఫరెన్స్ ద్వారా 800 కోట్ల డాలర్ల వరకు సేకరించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డాన్ రాసింది. కానీ, ప్రజలు అంతకంటే ఎక్కువ కావాలని కోరుకుంటున్నారని తెలిపింది.

అయితే, సమస్యకు ఇది మాత్రమే పరిష్కారం కాదని డాన్ రాసింది. దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణలను పాకిస్తాన్ తీసుకురావాల్సి ఉందని సూచించింది.

''పాకిస్తాన్ వద్ద కేవలం 450 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 20 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. ఎవరైనా పాకిస్తాన్‌ను రక్షించగలరు అంటే అది ఐఎంఎఫ్‌ మాత్రమే. సౌదీ అరేబియా నుంచి డబ్బు పొందడం ఆలస్యం కానుంది’’ అని ఖబారియా చానల్ పబ్లిక్ న్యూస్ డిబేట్ షోలో పాకిస్తాన్ ఆర్థిక కాలమిస్ట్ ఫరూఖ్ సలీమ్ అన్నారు.

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం

ప్రతీది ఖరీదైనదే...

పాకిస్తానీలు ఒక్కో డాలర్‌కి 240 పాక్ రూపాయిలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధనం నుంచి ఆహారం వరకు ప్రతి వస్తువు ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది.

పాకిస్తాన్‌లో కేజీ ఉల్లిపాయల ధర రూ. 240గా ఉంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు మార్కెట్లను, మాల్స్‌ను, పెళ్లి మండపాలను త్వరగా మూసి వేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది.

రాత్రి 8.30 కల్లా మార్కెట్లను, మాల్స్‌ను మూసి వేయాలని గత వారం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ ఆదేశించారు. అదేవిధంగా, పెళ్లి మండపాలను రాత్రి 10 గంటల కల్లా మూసివేయాలని తెలిపారు. దీని వల్ల 60 బిలియన్ రూపాయల వరకు ఆదా చేయగలుగుతామని అన్నారు.

పాకిస్తాన్ రూపాయి బలహీన పడుతుండటంతో ఆ దేశం నుంచి ఆఫ్గానిస్తాన్‌కు డాలర్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒక విదేశీ కరెన్సీ డీలర్ చెప్పారు.

అధికారిక, అనధికారిక వాణిజ్యం ద్వారా ప్రతి నెలా 200 కోట్ల డాలర్ల వరకు అఫ్గానిస్తాన్ వెళ్తున్నట్లు పాకిస్తాన్ ఎక్స్చేంజ్ కంపెనీల సంఘం చైర్మన్ మాలిక్ బోస్టన్ చెప్పారు.

అన్ని సరిహద్దుల గుండా స్మగ్లింగ్ జరుగుతున్నట్టు చెప్పారు. ఇది పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలపై నేరుగా ప్రభావం చూపుతుందని అన్నారు.

1965లో, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్యన అఫ్గాన్ రవాణా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద అఫ్గానిస్తాన్ పాకిస్తాన్ కరాచి పోర్టును వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pakistan: Clashes between people for flour and roti - will the situation worsen in another month?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X