భారత్-అమెరికా మిత్రత్వం.. పాక్ వెన్నులో వణుకు!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత్-అమెరికాలు వ్యూహాత్మకంగా దగ్గరవుతుండడం పాకిస్తాన్ కు కంటగింపుగా మారింది. ఇరు దేశాల మధ్య బలపడుతున్న బంధాన్ని చూసి బెంబేలెత్తిపోతోంది. ఇదే విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సఫీజ్ జకారియా బయటపెట్టేశారు.

భారత్-అమెరికా మధ్య కుదురుతున్న ఒప్పందాల వల్ల భారత్ బలపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాల్సిందేనంటూ ఇటీవల పాకిస్తాన్ కు అమెరికా తెగేసి చెప్పింది. అంతేకాదు, ఆ దేశానికి సుదీర్ఘ కాలంగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేసి ఊహించని షాక్ ఇచ్చింది.

Pakistan Expresses Concern Over US Selling Guardian Drones To India

అమెరికా చర్యతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయింది. దీనికి తోడు పుండుమీద కారం చల్లినట్టుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన 22 ప్రిడేటర్ డ్రోన్ల విక్రయానికి సంబంధించి భారత్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డ్రోన్లు భారత రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించడంతోపాటు భారత జలాంతర్గాములకు అనుసంధానంగా పనిచేస్తాయి.

సరిగ్గా ఇదే అంశం పాక్ ఆందోళనకు కారణమైంది. పాక్‌ విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి నఫీజ్‌ జకారియా వారంతపు మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ గత జూన్‌లో మోడీ చేసిన అమెరికా టూర్‌ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.

మోడీ.. అమెరికాతో అత్యంత ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని వ్యాఖ్యానిస్తూ...
ప్రిడేటర్ డ్రోన్లు కనుక భారత్‌కు అందితే భారత్-పాక్‌ల మధ్య ఉన్న సమస్థాయి దెబ్బ తింటుందని నఫీజ్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే దక్షిణాసియాలో సుస్థిరతకు ప్రమాదం వాటిల్లుతుందని కూడా ఆయన వ్యాఖ్యనించారు.

భారత్‌-అమెరికా సంబంధాలకు ఈ ఒప్పందం గేమ్‌ చేంజర్‌గా మిగలడంతోపాటు అమెరికాకు భారత్‌ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా అవతరించనుంది. ఈ గార్డియన్ డ్రోన్లు గనుక భారత్ నౌకాదళంలో చేరితే గస్తీ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇదే గనుక జరిగితే పాక్ పై భారత్ దే పైచేయి అవుతుంది. ఈ అంశమే ఇప్పుడు పాక్ పెద్దలకు కంటికి కునుకు లేకుండా చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan today expressed concern over the sale of 22 Guardian drones to India by the US and said it would result in strategic imbalance in the region. Foreign Office spokesperson Nafees Zakaria, during his weekly media briefing, highlighted that during Prime Minister Narendra Modi's visit to the US in June, a major deal for sale of Guardian unmanned aerial vehicles (submarine drones) was finalised. "We had expressed our concerns on the sale of advanced military technologies to India. We believe that such sales accentuate military imbalances in the region and undermine strategic stability in South Asia," Mr Zakaria said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి