పాక్ దుస్సాహసం, సిమ్లా అగ్రిమెంట్ నిలిపివేత- ఏంటి ఆ ఒప్పందం, యుద్దమే..!!
పహల్గామ్ లో ఉగ్రదాడి భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలక కారణమైంది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉన్నట్లు భారత్ తేల్చింది. ప్రధాని మోదీ ఈ దాడికి కారకులు.. వెనుక ఉన్నవారిని వదిలేని లేదని తేల్చి చెప్పారు. భారత్ కఠిన చర్యలతో పాక్ సైతం తమ వైపు నుంచి ప్రతీకార చర్యలను ప్రకటిం చింది. అందులో భాగంగా రెండు దేశాల సరిహద్దులకు సంబంధించి సిమ్లా ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా పరోక్షంగా పాక్ యుద్దానికి రంకెలు వేసున్నట్లు కనిపిస్తోంది.
పాక్ ప్రతీకార నిర్ణయాలు
పహల్గామ్ ఉగ్ర దాడితో భారత్ జాతీయ భద్రతా కమటీ పాక్ పైన దౌత్య యుద్దం ప్రారంభించింది.
పలు నిర్ణయాలు తీసుకుంది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ ఎన్ఎస్స్సీ సైతం ప్రతీకార చర్యలను మొద లు పెట్టింది. భారత్ సింధు నీటిని ఆపివేస్తే దానిని యుద్ధంగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. దీనికి కొనసాగింపుగా భారత్ తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను తక్షణమే నిలిపివేయాలని పాకిస్తాన్ సర్కార్ నిర్ణయించింది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. భారతీయుల వీసాలను రద్దు చేసింది. పాకిస్తాన్‌లో ఉన్న భారతీయులందరూ ఏప్రిల్ 30 లోపు దేశం విడిచి వెళ్లాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది.

సిమ్లా ఒప్పందం రద్దు
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇది 240 మిలియన్ల పాకిస్తానీయులకు జీవనాడి అని పేర్కొంది. సింధు జల ఒప్పందాన్ని భారతదేశం ఏకపక్షంగా నిలిపివేయడం యుద్ధ చర్యకు సమానమని, పూర్తి జాతీయ శక్తితో ప్రతిస్పందించినట్లని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే, పాక్ తీసుకున్న నిర్ణయంలో సిమ్లా ఒప్పందం నిలిపివేత. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మరోసారి యుద్ద వాతావరణం ఖాయంగా కనిపిస్తోంది. 1972 జూలై 2న ఇరు దేశాలు మధ్య సిమ్లా ఒప్పందంగా పిలుచుకునే శాంతి ఒప్పందంపై సంతకం జరిగింది. 1971 డిసెంబరులో ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ.. నాటి పాకిస్తాన్ ప్రధాని జులిఫ్కర్ అలీ భుట్టో మధ్య ఈ ఒప్పందం జరిగింది.
ఏంటీ ఒప్పందం..
1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో 90,000 మంది పాక్ సైనికులు లొంగిపో యారు. పాకిస్తాన్ జనరల్ నియాజీ ముందు లొంగుబాటు జరిగింది. అనంతరం నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లో ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఈ ఒప్పందం కోసం 1972, జూన్ 28న, పాకిస్తాన్ ప్రధాని భుట్టో హిమాచల్ రాజధాని సిమ్లా చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరగగా, ఉన్నట్టుండి జూలై 2న శాంతి ఒప్పందం వార్త రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఒప్పందం తర్వాత పాకిస్థాన్ అధికారికంగా బంగ్లాదేశ్‌ను గుర్తించడమే కాకుండా ఐదు ముఖ్యమైన అంశాలను అంగీకరించింది. రెండు దేశాలు పరస్పర సమస్యలను శాంతియుతంగా.. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా పరిష్కరించుకుంటాయన్నది ఈ ఐదింటిలో ఒక పాయింట్ మాత్రమే. కాశ్మీర్‌ను భారతదేశం చాలాసార్లు ద్వైపాక్షిక సమస్యగా పరిగణించింది. అయితే పాకిస్థాన్ ఎప్పుడూ థర్డ్ పార్టీల కోసం వేడుకుంటూనే వస్తోంది.
నియంత్రణ రేఖ ఖరారు
కాగా ఈ సిమ్లా ఒప్పందంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) నిర్ణయించారు. రెండు దేశాల సైన్యాలు ఉన్న స్థావరాన్ని నియంత్రణ రేఖగా పరిగణించాలని నిర్ణయించాయి. దీన్ని మార్చేందుకు ఏ దేశం ప్రయత్నించకూడదని కూడా తీర్మానించారు. భారతదేశం ఈ ఒప్పందానికి కట్టుబడివుంటోంది. ఈ ఒప్పందంలోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారతదేశం-పాకిస్తాన్‌లు తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటాయి. ఈ కారణంగానే 1999లో భారత్ కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని పలువురు రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ పాకిస్థాన్ తన చర్యలను నియంత్రించలేదు. పాక్.. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారతీయ పోస్టులకు చొరబాటుదారులను తరలించింది. ఈ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌ను చేపట్టింది. ఇప్పుడు ఈ ఒప్పందం నిలుపు దల చేస్తే చొరబాట్లు.. యుద్దానికి రంకెలు వేయటమేనే విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications