వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీచానికి దిగజారిన చైనా: భారత్‌లో దాడులకు ఉగ్రవాదుల సాయం, 2వేల సైన్యంతో పాక్..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దులో ఓ వైపు చైనా భారీ బలగాలను మోహరిస్తుంటే.. మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సైనికులను తరలిస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే), గిల్గిత్ బల్టిస్థాన్ సరిహద్దులోకి రెండు బృందాలుగా సైనికులను మోహరిస్తోంది పాకిస్థాన్.

చైనా తోక జాడిస్తే అంతే.: ఆ 3 దేశాల నుంచి భారత్‌కు ఆయుధాలు, 27న రఫేల్ యుద్ధ విమానాలుచైనా తోక జాడిస్తే అంతే.: ఆ 3 దేశాల నుంచి భారత్‌కు ఆయుధాలు, 27న రఫేల్ యుద్ధ విమానాలు

నీచానికి దిగజారిన చైనా.. చివరకు ఉగ్రవాదుల సాయం..

నీచానికి దిగజారిన చైనా.. చివరకు ఉగ్రవాదుల సాయం..

ఇక భారత్‌ను నేరుగా ఎదుర్కోలేని జిత్తులమారి చైనా చివరకు ఉగ్రవాదుల సాయం కూడా తీసుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లో దాడులకు పాల్పడి అలజడులు సృష్టించాలని పాక్ ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్‌తో చర్చలు జరిపింది. చైనా, పాకిస్థాన్ సైన్యాలతోపాటు మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధమైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఓ వైపు చైనా దళాలు.. మరో వైపు పాక్..

ఓ వైపు చైనా దళాలు.. మరో వైపు పాక్..

వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పువైపున ఇప్పటికే చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరించగా.. ఆ దేశానికి మద్దుతగా పాకిస్థాన్ 20,000 మంది సైనికులను తరలించింది. అంతేగాక, పాకిస్థాన్ తన రాడార్ వ్యవస్థను కూడా పూర్తిగా క్రియాశీలంగా ఉండేట్లు చూస్తోంది. సరిహద్దులో చైనా, పాకిస్థాన్‌లు తమ బలగాలను మోహరించడంతోపాటు భారత్‌పైకి ఉగ్రవాదులను దాడులు చేసేందుకు పంపుతున్నాయి. దీంతో భారత్.. చైనా, పాక్ దళాలతో పోరాడటంతోపాటు ఇటు ఉగ్రవాదుల ఏరివేతను కూడా కొనసాగించాల్సి ఉంటుంది.

చైనా, పాక్ కీలక చర్చలు..

చైనా, పాక్ కీలక చర్చలు..

గత కొద్ది వారాలుగా పాకిస్థాన్ అధికారులు, చైనా అధికారుల మధ్య కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీల్లో ఉత్తర లడఖ్ సమీపంలోని గిల్గిత్-బాల్టిస్థాన్‌లో పాక్ బలగాలను మోహరించాలని నిర్ణయించాయి. ఇక ఈశాన్య లడఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే చైనా బలగాలు వేలాది సంఖ్యలో మోహరించాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Recommended Video

TikTok బ్యాన్ ఎఫెక్ట్, Chingari Crosses 1Million Downloads On Play Store || Oneindia Telugu
చైనా, పాక్‌, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న భారత్

చైనా, పాక్‌, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న భారత్

ఈ క్రమంలో భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలను, ఆయుధాలను, క్షిపణులను మోహరించింది. ఇప్పటికే వాయుసేన దళాలు సరిహద్దులో కాపలాగా ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం సరిహద్దులలో కూడా భారత సైనికులు భారీగా మోహరిచారు. చైనా కుట్రల నేపథ్యంలో భారత్ అన్ని విధాలుగా సిద్ధమైంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాల నుంచి అత్యాధునిక ఆయుధాలను ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. జులై 27న ఫ్రాన్స్ నుంచి ఆరు రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకోనున్నాయి. కాగా, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఇప్పటికే భారత్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

English summary
Pakistan has moved two divisions of troops along the Line of Control (LoC) in occupied Kashmir and Gilgit-Baltistan and Chinese officials are holding talks with cadres of terrorist outfit Al Badr to incite violence in J&K, as per intelligence inputs, indicating clearer signs of a China-Pak collaboration on the border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X