వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో ఉగ్రవాదుల చొరబాటు వెనుక పాకిస్తాన్ ; పట్టుబడిన లష్కరే తోయిబా టెర్రరిస్ట్ చెప్పిన షాకింగ్ నిజాలు

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక చర్యలో లష్కరే తోయిబాకు చెందిన 19 ఏళ్ల పాకిస్థాన్ తీవ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. చొరబాటు నియోజక చర్యల్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నభారత భద్రతా దళాలకు, చొరబాటుదారులకు మధ్య జరిగిన కాల్పులలో ముగ్గురు భారత సైనికులు గాయపడ్డారు. ఒక ఉగ్రవాది మరణించగా, భారత భూభాగంలోకి చొరబడిన మరో ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. మరో నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ వైపు పారిపోయారు.

యూరీ దాడి తరహాలో భారీ ఉగ్ర కుట్ర : భగ్నం చేసిన ఆర్మీ, ముగ్గురు ఉగ్రవాదులు హతం, భారీగా ఆయుధాలు సీజ్యూరీ దాడి తరహాలో భారీ ఉగ్ర కుట్ర : భగ్నం చేసిన ఆర్మీ, ముగ్గురు ఉగ్రవాదులు హతం, భారీగా ఆయుధాలు సీజ్

యూరీ సెక్టార్ లో సెర్చ్ ఆపరేషన్ .. ఒకరు మృతి, మరొకరి అరెస్ట్

యూరీ సెక్టార్ లో ఆర్మీ ఆపరేషన్ సెప్టెంబర్ 18 న ప్రారంభించబడింది. ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో సెప్టెంబరు 18వ తేదీ నుండి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులు చొరబాటు యత్నం చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో నలుగురు కంచె అవతలి వైపు ఉండగా, ఇద్దరు భూభాగం వైపు వచ్చారు. అటువైపు ఉన్న నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ తప్పించుకోగా, మిగిలిన ఇద్దరు చొరబడ్డారు. 26 వ తేదీ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక చొరబాటుదారుడు మరణించగా,మరొకరిని సజీవంగా పట్టుకున్నారు.

 పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది.. లష్కరే తోయిబా శిక్షణ

పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది.. లష్కరే తోయిబా శిక్షణ

పట్టుబడ్డ చొరబాటుదారుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒకరా జిల్లా నివాసి అయిన 19 ఏళ్ల అలీ బాబర్ పాత్రగా చెప్తున్నారు. అతడు ముజఫరాబాద్ లో శిక్షణ పొందిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా వెల్లడించారని ఆర్మీ పేర్కొంది. 2019 లో ముజఫరాబాద్‌లోని గడీవాలాలోని ఖైబర్ క్యాంప్‌లో మూడు వారాల పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అతను పాకిస్థాన్లోనే శిక్షణ తీసుకున్నట్టు వెల్లడించారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో పాకిస్థాన్ పాత్రను పాత్రా ఇచ్చిన సమాచారం మరోమారు స్పష్టం చేస్తుంది.

టెర్రరిస్ట్ గ్రూప్ లో చేరినందుకు 50 వేల నగదు, భారత్లో చొరబాటుకు ట్రైనింగ్

ఉగ్రవాద గ్రూపులో చేరినందుకు తనకు దాదాపు రూ .50,000 ఇచ్చినట్లు పాత్ర చెప్పారు. పాకిస్తాన్ జాతీయుడు అయిన పాత్రా తన తండ్రి మరణానంతరం, ఉగ్రవాదంలో చేరడం తప్ప తనకు వేరే మార్గం లేదని చెప్పాడు. పాత్రా గతంలో బట్టల ఫ్యాక్టరీలో పని చేసేవాడు. టెర్రరిస్ట్ పాత్రా తాను టెర్రర్ హ్యాండ్లర్‌ను కలిశానని, వారు 2019 లో ఎల్‌ఈటీ క్యాంప్‌కు తీసుకెళ్లానని చెప్పాడు. నియంత్రణ రేఖ దాటడానికి ముందు అతడికి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఇక చొరబాటు క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతనితో పాటు చొరబాటులో పాల్గొన్న అనాస్ మృతి చెందటంతో భయపడిన పాత్రా ఎల్‌ఓసి నుంచి తన తల్లికి మెసేజ్ పంపానని, నియంత్రణ రేఖకు భారతదేశం వైపుకు వెళ్లడం ద్వారా తాను పొరపాటు చేశానని, తిరిగి రావాలనుకుంటున్నానని పత్రా చెప్పాడని వెల్లడించారు.

యూరీ తరహా భారీ ఉగ్ర దాడి స్కెచ్ .. పాకిస్తాన్ పాత్ర నిర్ధారించిన ఆర్మీ

యూరీ తరహా భారీ ఉగ్ర దాడి స్కెచ్ .. పాకిస్తాన్ పాత్ర నిర్ధారించిన ఆర్మీ

సలామాబాద్ నాలా వెంట చొరబాటు ప్రయత్నం జరిగినట్లు పేర్కొన్న ఆర్మీ అధికారి, ఇది 2016 లో యూరీ ఉగ్ర ఆత్మాహుతి దాడికి ఉపయోగించిన మార్గం ద్వారా వచ్చిన వారు యూరీ ఉగ్రదాడి తరహాలో భారీ దాడికి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. చొరబాటుకు యత్నం చేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుండి మద్దతు లభిస్తోందని, ముగ్గురు పోర్టర్‌లు నియంత్రణ రేఖ వరకు ఉగ్రవాదులకు కావాల్సిన సామాగ్రిని తీసుకువచ్చారు" ఆర్మీ అధికారి చెప్పారు.

పాక్ సైన్యం పాత్ర లేకుండా ఉగ్రవాదుల చొరబాటు సాధ్యం కాదన్న ఆర్మీ

పాక్ సైన్యం పాత్ర లేకుండా ఉగ్రవాదుల చొరబాటు సాధ్యం కాదన్న ఆర్మీ

పాకిస్థాన్ సైన్యం పాత్ర లేకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరగవని ఆ అధికారి చెప్పారు. నియంత్రణ రేఖ అంతటా విపరీతమైన ఉగ్రవాద కదలికలు ఉన్నాయని మేజర్ జనరల్ వాట్స్ చెప్పారు. ప్రస్తుతం కాశ్మీర్ శాంతియుతంగా ఉందని, కాశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపుతుందని, ఇదే సమయంలో ఉగ్రవాదుల కుట్ర ను భగ్నం చేయడంతో నిరాశకు గురి అవుతోంది అని ఆయన పేర్కొన్నారు . ఇటీవల కాలంలో అనేక మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటులకు ప్రయత్నం చేస్తూ హతమయ్యారు అని ఆయన పేర్కొన్నారు

English summary
Pakistan role behind terrorist infiltration in India .. Shocking facts told by captured Lashkar - e - Toiba terrorist. He was trained in Muzaffarabad. He has revealed that role of pakistan terrorist infiltration in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X