వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవ్వింపు చర్య: గుజరాత్ సరిహద్దుల్లో పాక్ ఎయిర్ బేస్ నిర్మాణం

|
Google Oneindia TeluguNews

చాలా కాలం విరామం తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్‌లోని గుజరాత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఒక ఎయిర్ బేస్ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల మధ్య ఈ నిర్మాణం జరిగినట్లు సమాచారం. తమ మిలటరీ ఆపరేషన్స్ కోసం అత్యాధునిక ఎయిర్ ఫీల్డ్‌ను హైదరాబాద్ జిల్లాలోని భోలారిలో అభివృద్ధి చేసింది. ఇక్కడ చైనాలో తయారైన జేఎఫ్ -17 యుద్ధ విమానాలను ఇక్కడ ఉంచుతుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే భారత్‌కు ఉన్న యుద్ధ విమానాలను తట్టుకునేందుకు పాకిస్తాన్ చైనాకు చెందిన జేఎఫ్ -17 యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Pakistans provocative act..develops airbase in the borders of Gujarat

ఇది చాలదన్నట్లుగా... పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను సైతం పాకిస్తాన్‌లోని హైదరాబాద్ జిల్లాలో మోహరించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ పూనుకుంటున్న ఈ పనిపై చాలా వేగవంతంగా రియాక్ట్ అయ్యింది భారత ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతపై జరిగిన కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లోని దీసా సమీపంలో ఫైటర్ బేస్ స్థాపించాలని డిసైడ్ చేశారు. అయితే ఇక్కడ రన్‌వేను పొడిగించేందుకు కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

English summary
After a long gap, Pakistan has up the ante against India. Sources say that Pakistan has constructed a airbase in the borders of Gujarat.This was developed in order to deploy the chinese made JF-17 fighters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X