భారత్ స్ధావరాలపై పాక్ దాడి... భారత జవాన్‌తో సహా ఐదుగురు మృతి

జమ్మూ కాశ్మీర్: పాకిస్ధాన్ కొత్త సంవత్సరం నాడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో 12 భారత స్ధావరాలపై పాకిస్ధాన్ సైనికులు కాల్పులు జరిపారు. సాంబ సెక్టార్‌లోని మోర్తార్ షెల్లింగ్‌లో గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్‌తో సహా ఐదుగురు మృతి చెందగా, మరో జవాను గాయపడ్డారు. మరణించిన జవానును శ్రీరాం గౌరియా గా గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు పాకిస్ధాన్ జవాన్లు చనిపోయారు. తమ సహచరుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు వీలుగా కాల్పులు ఆపివేయాలంటూ తెల్లజెండాలు చూపుతూ వారు చేసిన వినతి గౌరవిస్తూ బీఎస్‌ఎఫ్ దళాలు కాల్పులు ఆపివేశాయని బీఎస్ఎఫ్ ఐజీ రాకేశ్ శర్మ చెప్పారు.

Pakistan targets 12 Indian posts in J&K after BSF kills 4 troopers in retaliation

పాకిస్ధాన్ సైనికుల దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. గత 24 గంటల్లో పాకిస్ధాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండోసారి. తాజా పరిస్థితిని పారామిలిటరీ బలగాల డెరైక్టర్ జనరల్ తనకు వివరించగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ప్రతిస్పందించారని, పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆదేశించారన్నారు.

భద్రతా దళాలు రెట్టింపు బలగంతో పాక్ సైన్యాన్ని ప్రతిఘటించాలని అంతకు ముందు రక్షణ మంత్రి పారికర్ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు గస్తీ నిర్వహిస్తుండగా పాకిస్ధాన్ రేంజర్లు భారీగా కాల్పులకు తెగబడ్డారని బీఎస్ఎఫ్ ఐజీ రాకేశ్ శర్మ తెలిపారు.

ఇటీవల కాలంలో పాకిస్ధాన్ సైనికులు భారత్ భూభాగంలోకి ప్రవేశించడం మరీ ఎక్కువైంది. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పాకిస్ధాన్ సైనికులు 555 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దీంతో 14 మంది భారత పౌరులు, ఐదుగురు జవాన్లు మరణించారని అధికారికంగా ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+