తల్లినీ, భార్యను బాగా చూశారు: వీడియో విడుదల చేసిన పాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

స్లామాబాద్: వేడి చల్లారకముందే కులభూషణ్ జాదవ్ తాజా వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది. పాకిస్తాన్‌లో జైలు శిక్ష పడి జైలులో ఉన్న కులభూషణ్ జాదవ్ కొత్త వీడియోను పాకిస్తాన్ తాజాగా విడుదల చేసింది.

పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయం నుంచి ఆ వీడియో విడుదలైనట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో కులభూషణ్ జాదవ్ పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తనను కలిసినప్పుడు తల్లీభార్య భయపడినట్లు కనిపించారని, భారత దౌత్యవేత్త వారిపై అరిచారని ఆయన ఆ వీడియోలో చెప్పారు.

తను మంచి ఆరోగ్యంతో ఉన్నానని కులభూషణ్ యాదవ్ చెప్పినట్లు వీడియోలో ఉంది. తను ఆరోగ్యంగా ఉండడంతో తల్లి చాలా సంతోషించిందని ఆయన అన్నారు. ఇస్లామాబాద్‌కు విమానంలో వస్తుండగా భారత అధికారి తన తల్లిని అవమానించాడని ఆయ అన్నారు.

తన తల్లితో ఉన్న భారత దౌత్యవేత్త తన తల్లిపై తెంపు లేకుండా కేకలు వేస్తూ పోయారని కులభూషణ్ యాదవ్ అన్నారు. ఇస్లామాబాద్‌లో జాదవ్ భార్య చేతాంకుల్, తల్లి అవంతి పట్ల అమర్యాదగా ప్రవర్తించారని భారత్ విమర్సించిన ఇన్నాళ్లు కులభూషణ్ యాదవ్ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Indian Naval officer Kulbhushan Jadhav, who is on death row in Pakistan, with his mother and wife, the neighbouring country has released a new video of the jailed Indian.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి