కాశ్మీరీల పోరాటానికి పాక్ సంపూర్ణ మద్దతు: బాసిత్

గురువారం పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మానవ హక్కులకు సంబంధించిన యుఎన్ చార్టర్, అంతర్జాతీయ ఒడంబడికకు అనుగుణంగా కాశ్మీరీలు సాగిస్తున్న న్యాయమైన పోరాటానికి పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిస్థాయి దౌత్య, నైతిక మద్దతును కొనసాగిస్తుందని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను' అని బాసిత్ అన్నారు.
ఓ వైపు ఆగస్టు 25న ఇస్లామాబాద్‌లో రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య చర్చలకు రంగం సిద్ధమవుతుండగా మరోవైపు కొద్ది రోజులుగా పాక్ సైనికులు ఆధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా ఉల్లంఘించడం తెలిసిందే.
బుధవారం రాత్రి పూంఛ్ జిల్లాలో ఆధీన రేఖ వద్ద భారత సరిహద్దు స్థావరాలపై పాక్ కాల్పులు జరపింది. అయిదు రోజుల్లో పాక్ కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడ్డం ఇది ఆరోసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications