పాకిస్థాన్ జిందాబాద్: దెబ్బకు దెయ్యం దిగింది, పండగ చేసుకున్న దేశద్రోహి అరెస్టు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో పాక్ చేతిలో టీం ఇండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపి ఎత్తుకుపోయిందని ఆనందంలో గంతులు వేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

టెక్కీ క్యాబ్ దిగింది, నడిరోడ్డులో యువతిని నలిపేశారు. ముద్దుల వర్షం, లిప్ లాక్, దర్జాగా !

దేశద్రోహం కింద కేసు నమోదు కేసి అతన్ని జైలుకు పంపించారు. కర్ణాటకలోని హావేరి జిల్లా, సవణూరు పట్టణంలో నివాసం ఉంటున్న షబ్బీర్ అహమ్మద్ బిజాపురి (35) అనే వ్యక్తి భారతదేశానికి విరుద్దంగా నినాదాలు చెయ్యడంతో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

Pakistan Zindabad, Man arrested in Haveri district in Karnataka.

పాక్ చేతిలో టీం ఇండియా ఓటమి చెందిన తరువాత షబ్బీర్ అహమ్మద్ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడని, టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి పండగ చేసుకున్నాడని స్థానికులు సవణూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టెక్కీలకు అందమైన అమ్మాయిల వల: బెంగళూరులో పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్, క్లైమాక్స్ లో !

స్థానికుల ఫిర్యాదు మేరకు షబ్బీర్ అహమ్మద్ మీద దోశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. షబ్బీర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని హావేరి జిల్లాలో ఆందోళనలు మొదలైనాయి. షబ్బీర్ అహమ్మద్ బిజాపురి జైల్లో చిప్పకూడు తినాలని, అప్పుడే బుద్ది వస్తోందని స్థానికులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan Zindabad: A 35-year-old man arrested in Haveri district in Karnataka.
Please Wait while comments are loading...