పాక్ తండ్రి, భారత్ తల్లి, మీ పిల్లలకు భారత్ పౌరసత్వం ఎలా ఇస్తాము, హైకోర్టు, దుబాయ్ లవ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: పాకిస్తాన్ వ్యక్తికి పుట్టిన పిల్లలకు భారత పౌరసత్వం ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని, ఈ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్ కు చెందిన మహిళ, పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి దుబాయ్ లో లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు.
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత పాకిస్తాన్ మొగుడు దుబాయ్ కోర్టులో భారత్ భార్యకు చట్టపరంగా విడాకులు ఇచ్చేశాడు. ఇద్దరు పిల్లల భాద్యతను కూడా భార్యకు వదిలేసిన పాకిస్తాన్ పాపిస్టి మొగుడు చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు కన్న బిడ్డలకు భారత పౌరసత్వ రాకపోవడంతో ఏం చెయ్యాలో తెలీక ఆమె అయోమయంలో పడిపోయింది.
భారత్ కు చెందిన అమీనా అనే మహిళ దుబాయ్ లో ఉద్యోగం చేసే సమయంలో పాకిస్తాన్ కు చెందిన అస్సాద్ మల్లిక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. 2002లో అమీనా, అస్సాద్ మల్లిక్ దుబాయ్ లో వివాహం చేసుకున్నారు. 2004లో ఓ బిడ్డ, 2008లో ఓ బిడ్డ దంపతులకు జన్మించారు. దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో దుబాయ్ కోర్టులో చట్టపరంగా దంపతులు విడాకులు తీసుకున్నారు.

ఇద్దరు పిల్లల పోషణ భార్య అమీనాకు ఇచ్చేసిన అస్సాద్ మల్లిక్ అతను హ్యాపీగా ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాలు దుబాయ్ లో పిల్లలతో కలిసి జీవించిన అమీనా వారి పోషణ కష్టం కావడంతో బెంగళూరులోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది. అప్పటికే పిల్లలకు పాకిస్తాన్ పాస్ పోర్టు ఉండటంతో వాళ్లు భారత్ కు రాలేకపోయారు.
దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, పాకిస్తాన్ రాయబార కార్యాలయం అధికారులు చర్చించారు. తరువాత పాక్ వ్యక్తికి పుట్టిన ఇద్దరు పిల్లలు భారత్ వెళ్లడానికి మానవత్వంతో భారత్ అధికారులు 2021 మే 21వ తేదీన తాత్కాలిక పాస్ పోర్టు మంజూరు చేశారు. భారత్ వచ్చిన అమీనా తన పిల్లలకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర హోమ్ శాఖకు 2022 మే 5వ తేదీన అమీనా లేఖ రాసింది.
కేంద్ర హోమ్ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అమీనా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. 2022 సెప్టెంబర్ లో మీ పిల్లలకు భారత పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హో శాఖ అమీనాకు స్పష్టం చేసింది. అమీనా వేసిన పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న పూర్తి సమాచారం తెలుసుకున్నారు.
పాకిస్తాన్ వ్యక్తి,, భారత్ మహిళకు పుట్టిన పిల్లలకు ప్రస్తుతం 17 ఏళ్ల, 14 ఏళ్ల ఉన్నాయని, వారు పాకిస్తాన్ పౌరసత్వం రద్దు చేసుకుంటేనే భారత పౌరసత్వం ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. పాకిస్తాన్ పౌరసత్వం రద్దు చేసుకోవాలంటే 21 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. అందువలన పాక్ వ్యక్తికి పుట్టిన మీ పిల్లలకు భారత పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదని, ఈ విషయంలో కేంద్ర హోమ్ శాఖకు ఎలాంటి సూచనలు ఇవ్వలేమని కర్ణాటక హైకోర్టు చెప్పింది.












Click it and Unblock the Notifications