వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పంజాబ్ సీఎం! పాక్ గూఢచారిని ఇంట్లోనే పెట్టుకున్నారు’

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై మరోసారి సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడింది. పాకిస్థాన్ గూఢచారి అయిన అరూసా ఆలమ్‌కు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఆశ్రయం కల్పించారని ఆప్ నేత సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా ఆరోపించారు.

ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరూసా ఆలం ప్రస్తుతం బస చేస్తున్నారని ఆయన అన్నారు. అరూసా ఆలం గురించిన ఖచ్చతమైన సమాచారంతోనే తాను మాట్లాడుతున్నాని సుఖ్‌పాల్‌ సింగ్‌ చెప్పడం గమనార్హం.

Pakistani Spy Stayed at Amarinder Singh's Residence, Claims AAP MLA Sukhpal Khaira

పంజాబ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ.. సుఖ్‌పాల్‌ సింగ్‌ ఈ అంశంపైనే ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన భాషలో విమర్శలు గుప్పించారు.

అరూసా ఆలంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని సుఖ్ పాల్ సింగ్ డిమాండ్‌ చేశారు. కాగా, సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా విమర్శలపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. ఖైరా మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అన్నారు.

English summary
In a startling claim, Leader of Opposition and Aam Aadmi Party (AAP) legislator Sukhpal Singh Khaira said Punjab Chief Minister Captain Amarinder Singh’s friend Aroosa Alam is a Pakistani spy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X