వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం బలనిరూపణ: కేబినెట్ లిస్ట్ పంపిన పళనిస్వామి, దినకరన్‌కు నో ఛాన్స్

అన్నాడీఎంకే నేత పళనిస్వామి సోమవారం నాడు బల నిరూపణ చేసుకోనున్నారు. బలనిరూపణకు ఆయనకు ఇంచార్జి గవర్నర్ పదిహేను రోజుల సమయం ఇచ్చారు. పళనిస్వామి ఈ సోమవారమే బలం నిరూపించుకోనున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే నేత పళనిస్వామి సోమవారం నాడు బల నిరూపణ చేసుకోనున్నారు. బలనిరూపణకు ఆయనకు ఇంచార్జి గవర్నర్ పదిహేను రోజుల సమయం ఇచ్చారు. పళనిస్వామి ఈ సోమవారమే బలం నిరూపించుకోనున్నారు.

పళని స్వామి ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోయెస్ గార్డెన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పు పైన కసరత్తు చేశారు.

<strong>జైలుకు శశికళ: ఎదిరించి.. మంచి ఛాన్స్ కోల్పోయిన పన్నీరుసెల్వం</strong>జైలుకు శశికళ: ఎదిరించి.. మంచి ఛాన్స్ కోల్పోయిన పన్నీరుసెల్వం

మంత్రుల వివరాలు గవర్నర్‌కు

మంత్రులుగా ప్రమాణం చేసే వారి వివరాలను పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర రావుకు పంపించారు. ముఖ్యమంత్రి సహా 31 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో దినకరన్ పేరు లేదు. నలుగురు మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. హోంశాఖ, ఆర్థిక శాఖను తన పళనిస్వామి తన వద్దే ఉంచుకున్నారు. మొత్తం 19 శాఖలను తన వద్ద ఉంచుకున్నారు.

Palanisamy gives minister list tn governor

పిడబ్ల్యూడీ శాఖ మంత్రిగా టాంగా తమిళసెల్వన్, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, చేనేత మంత్రిగా కోదండపాణి, పశుసంవర్థక శాఖ మంత్రిగా బాలకృష్ణ, సమాచార శాఖ మంత్రిగా కండబుర్ రాజు ప్రమాణం చేయనున్నారు.

గోల్డెన్ బే రిసార్టు నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు

పళనిస్వామి, ఆయన కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్టు నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజ్ భవన్ బయలుదేరారు. కాగా, ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి 9 రోజుల తర్వాత బయటకు వచ్చారు.

English summary
Edappadi K Palanisamy, leader of the AIADMK Legislature Party gave ministers list to Tamil Nadu governor Ch Vidyasagar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X