త్యాగానికి సిద్దం అయిన పళనిసామి: మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు !
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండాలని, అందుకు ఒక మెట్టుదిగడానికైనా తాను సిద్దంగా ఉన్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తన మంత్రి వర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో అన్నారని సమాచారం.
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండాలని, అందుకు ఒక మెట్టుదిగడానికైనా తాను సిద్దంగా ఉన్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తన మంత్రి వర్గ సభ్యులతో అన్నారని సమాచారం.
అన్నాడీఎంకే పార్టీ ముక్కలుచెక్కలు కాకుండా చూసుకునే బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఎడప్పాడి పళనిసామి తన సహచరులకు చెప్పారని తెలిసింది. తమలో తాము కోట్లాడుకుంటుంటే తమకు ముందు భవిష్యత్తు ఉండదనే విషయం గుర్తించుకోవాలని మంత్రులకు సూచించారని వెలుగు చూసింది.

మనకు పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ?
అన్నాడీఎంకే రెండు వర్గాలుగా ముక్కలు అయితే పార్టీతో పాటు మనకు భవిష్యత్తు ఉండదని అందురూ గుర్తు పెట్టుకుని రాజీకి సిద్దం కావడం అందరికీ మంచిదని ఎడప్పాడి పళనిసామి తన వర్గంలోని నాయకులకు హితభోద చేస్తున్నారు.

పన్నీర్ సెల్వం బెట్టు
పన్నీర్ సెల్వం వర్గం బెట్టు చేసినా విలీనంపై ప్రయత్నాలను ఎడప్పాడి పళనిసామి మానుకోలేదు. పన్నీర్ సెల్వం వర్గం పొంతనలేని డిమాండ్లు ముందుపెట్టి విలీనం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించినా ఎడప్పాడి పళనిసామి మాత్రం తన ప్రయత్నాలను మానుకోవడం లేదు.

రాయపేటలో చర్చలు
చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎడప్పాడి పళనిసామి తన మంత్రి వర్గంతో, అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్నారు.

పన్నీర్ వ్యూహంపై చర్చలు
పన్నీర్ సెల్వం వ్యూహరచనపైనా, వారి ఉద్దేశం పైనా తన వర్గంలోని నేతలతో ఎడప్పాడి పళనిసామి చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పళనిసామి తన ఉద్దేశాన్ని కూడా నేతలకు వివరించారని సమాచారం.

పన్నీర్ వర్గం విషయంలో
పన్నీర్ సెల్వం బెట్టు చేసినా పార్టీని పటిష్టపరచుకునేందుకు తాను ఓ మెట్టుదిగడానికైనా సిద్దంగా ఉన్నానని, దయచేసి అందరూ సహకరించాలని ఎడప్పాడి పళనిసామి మంత్రులు, ఎమ్మెల్యేలకు మనవి చేశారని సమాచారం.

మొహమాటం లేదు
మన అభివృద్దికి కారణం అయిన పార్టీని కాపాడుకునేందుకు మొహమాటం లేకుండా పన్నీర్ సెల్వం వర్గంతో రాజీకావడానికి తాము సిద్దంగా ఉన్నామని మెజారిటీ ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామికి హామీ ఇచ్చారని తెలిసింది.

ఎడప్పాడి పళనిసామి కమిటీ
తనతో ఏకీభవించే నేతలతో పన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు జరపడానికి ఎడప్పాడి పళనిసామి ఓ కమిటీ వేశారు. రాజ్యసభ సభ్యుడు వైద్యలింగం, మంత్రులు దిండుగల్ శ్రీనివాస్, తంగమణి, వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం తదితరులను కమిటీలో సభ్యులుగా నియమించారు.












Click it and Unblock the Notifications