టీటీవీ దినకరన్ ఔట్: ఢిల్లీ వెళ్లిన సీఎం పళనిసామి, శుభకార్యంలో, బీజేపీ పెద్దలతో !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యంత్రి ఎడప్పాడి పళనిసామి గురువారం చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు, ఆ పార్టీ నాయకులతో తీరకలేకుండా చర్చలు జరిపారు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం నుంచి పళనిసామి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

నాతో పెట్టుకోవద్దు, సీఎం పళనిసామికి వార్నింగ్ ఇచ్చిన శశికళ అక్క కొడుకు, పదవిలో ఉండవు !

భారత ఉప రాష్ట్రపతిగా ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి పళనిసామి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులతో ఎడప్పాడి పళనిసామి భేటీ కానున్నారని తెలిసింది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయాల గురించి పళనిసామి ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Palanisamy leaves Delhi participate the swearing in ceremony of Vice President Venkaiah Naidu.

టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించిన ఎడప్పాడి పళనిసామి అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో రాజకీయ ప్రధాన్యతకు దేశ రాజధాని వేదిక అయ్యింది. పన్నీర్ సెల్వంతో విలీనం విషయంలో ఆయన ఢిల్లీలో చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎడప్పాడి పళనిసామి ఢిల్లీ పెద్దలను ఎవరెవరిని కలుస్తారు ? అనే విషయం వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Chief Minister Edappadi Palanisamy arrived Delhi this evening to participate in the swearing-in ceremony of Vice President Venkaiah Naidu.
Please Wait while comments are loading...