వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని సీరియస్: సిగ్గుతెచ్చుకోవాలని జైట్లీ, పనామా పేపర్స్‌పై స్పందన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పనామా పేపర్స్‌ ద్వారా లీకైన నల్లధనం కుబేరుల జాబితాలో దాదాపు 500 మంది భారతీయులున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. జైట్లీ సీఐఐ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. నల్లధనం వివరాలు బయటపెట్టకుండా, పన్నులు కట్టకుండా ఇలాంటి పనులు చేస్తున్న వారు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని రుజువవుతుందని జైట్లీ హెచ్చరించారు.

విదేశాల్లో ఉన్న నల్లధనం వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలంటూ ప్రభుత్వం నిరుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కొంతమేరకు నల్లధనం బయటపడింది. విదేశాల్లో ఉన్న నల్లధనం బయటపెట్టాలని అవకాశం ఇచ్చినా చాలా మంది వినియోగించుకోలేదని, ఇలాంటి వారు తప్పక మూల్యం చెల్లిస్తారని జైట్లీ అన్నారు.

Panama Papers: PM Modi has asked to probe the matter, monitor reports, says Arun Jaitley

విదేశాల్లో ఉన్న నల్లధనం బయటపెట్టేందుకు 2017లో కఠిన చర్యలు తీసుకుంటామని.. అప్పుడు ఆస్తులను దాచి పెట్టడం చాలా కష్టమని స్పష్టంచేశారు.
విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారు ఇకనైనా సిగ్గుపడి ఆ వివరాలు బయటకు వెల్లడించి, దేశాభివృద్ధికి సహకరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

అక్రమాస్తుల స్వచ్ఛంద వెల్లడికి గత సంవత్సరం బడ్జెట్ సందర్భంగా అవకాశం కల్పించామని ఆయన గుర్తు చేశారు. తాజాగా విడుదలైన జాబితా వివరాలు ఇండియాతో పాటు ప్రపంచానికి కనువిప్పు కావాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని, ఇందులో వచ్చిన భారతీయుల పేర్ల వివరాలను ప్రధాని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు.

ఇప్పటికే సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్), ఆర్బీఐ సహా బహుళ సంస్థల బృందం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. వీరందరి గుట్టునూ త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు.

కాగా, పనామా దేశంలోని మొసాక్‌ ఫోన్సెకా అనే సంస్థ నుంచి దాదాపు కోటీ 15 లక్షల రహస్య పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. ఇందులో పన్నులు ఎగ్గొడుతూ కోట్ల కొద్దీ సంపదను కూడబెడుతున్న దేశాధినేతలు.. సెలబ్రిటీల వివరాలూ వెల్లడయ్యాయి. ఈ జాబితాలో 500 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.

English summary
"PM Modi has himself requested that this matter be investigated... I think its a healthy step that this kind of exposes are being made," Finance Minister Arun Jaitley said, reacting to The Indian Express story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X