పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం: ఎందుకంటే? దీప పరిస్థితి !
పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో ఆయన ఇంటిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో దీపాకు మద్దతు ఇవ్వాలా ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పరమ విధేయుడైన పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో పోయెస్ గార్డెన్ సమీపంలోని వీనస్ కాలనీలోని ఆయన ఇంటిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల విషయంపై పన్నీర్ సెల్వం చర్చిస్తున్నారు.
ఆర్ నగర్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే జయలలిత మేనకోడలు ప్రకటించారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయనతో కలిసి పని చేస్తానని దీపా అమ్మ సమాధి సాక్షిగా చెప్పారు.
అనంతరం పన్నీర్ సెల్వం వర్గీయులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారని దీపా పేరవై నాయకులు ఆరోపణలు చేశారు. ఇక ముందు దీపా పేరవై నాయకులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పన్నీర్ సెల్వం తన వర్గీయులకు సూచించారు..

అయితే అనూహ్యంగా తాను పన్నీర్ సెల్వంను గౌరవించి మర్యాదాపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యానని, దీపా పేరవై నాయకుల అభిప్రాయం మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తానని దీపా ఆయనకు దూరం అయ్యారు. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవైని స్థాపించి పన్నీర్ వర్గీయులకు మరింత దూరం అయ్యారు.
ఇప్పుడు జయలలిత మేనకోడలు దీపాకు మద్దతు ఇవ్వాలా ? లేదా ? అన్నాడీఎంకే చీలిక వర్గం నుంచి ఎవరినైనా బరిలో నిలబెట్టాలా అని పన్నీర్ సెల్వం వర్గీయులు చర్చిస్తున్నారు. మొత్తం మీద ఈ ఒక్క సారికి జయలలిత వారసురాలిగా దీపాకే మద్దతు ఇవ్వాలని పన్నీర్ సెల్వం వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications