వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ లో పన్నీర్, దీపా బహిరంగ సభ: శశికళ వర్గంలో వణుకు !

జయలలిత జయంతి సందర్బంగా శుక్రవారం ఆర్ కే నగర్ నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయ మేనకోడలు దీపా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి ఏర్పాట్లు పూర్తి చెయ్యడంతో శశికళ వర్గం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమ్మ జయలలిత జయంతి సందర్బంగా ఆర్ కే నగర్ వేదికగా శుక్రవారం తలబెట్టిన భారీ బహిరంగ సభ కు జనసమీకరణ లక్షంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయన వర్గీయులు అడుగులు వేస్తున్నారు.

జైల్లో మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్: మేమం ఉండలేం !జైల్లో మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్: మేమం ఉండలేం !

జయలలిత మేనకోడులు దీపా పేరవైతో కలిసి పనిచేయ్యాలని తన మద్దతుదారులకు పన్నీర్ సెల్వం సూచించారు. ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోయినా, అధికారం దూరమైనా, కేడర్ మద్దతుతో తన బలాన్ని చాటుకోవాలని పన్నీర్ సెల్వం అడుగులు వేస్తున్నారు.

దీపా పేరవై నాయకుల అసహనం

దీపా పేరవై నాయకుల అసహనం

పన్నీర్ సెల్వం శిభిరంలో జయలలిత మేనకోడలు చేరిన వియం తెలిసిందే. అయితే మాతో కాని, దీపాతో కాని పన్నీర్ సెల్వం వర్గీయులు చర్చించడం లేదని, వారు తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడాల్సిన పరిస్థితి వచ్చిందని దీపా పేరవై నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

ఇక ముందు అలా జరగదు

ఇక ముందు అలా జరగదు

దీపా పేరవై నాయకుల అసహనం గురించి తెలుసుకున్న మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు దీపా పేరవై నాయకులకు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని తన అనుచరులకు సూచించారు. ఇక ముందు అలాంటి పోరపాట్లు జరగవని దీపా పేరవై నాయకులకు పన్నీర్ సెల్వం హామీ ఇచ్చారు.

శశికళ వర్గం స్కెచ్

శశికళ వర్గం స్కెచ్

ఆర్ కే నగర్ లో పన్నీర్ సెల్వం, జయలలిత మేనకోడలు దీపా సభ నిర్వహించి ఆర్ కే నగర్ నియోజక వర్గంలో పర్యటించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవాలని శశికళ వర్గం స్కెచ్ వేసిందని వెలుగు చూసింది. అయితే ఆర్ కే నగర్ నియోజక వర్గంలో దీపా కచ్చితంగా పర్యటిస్తారని దీపా పేరవై నాయకులు తేల్చి చెప్పారు.

పన్నీర్ సెల్వం వర్గం సమావేశం

పన్నీర్ సెల్వం వర్గం సమావేశం

శుక్రవారం జయలలిత జయంతి సందర్బంగా ఆర్ కే నగర్ లో జరిగే బహిరంగ సభ ముగిసిన తరువాత రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన పన్నీర్ సెల్వం తన వర్గీయులతో సమావేశం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇంటిలో ఆయన మద్దతుదారులు పొన్నయన్, కేపీ. మునిసామి, నత్తం విశ్వనాథన్, మైత్రేయన్ తదితరులు సమావేశం అయ్యి సుదీర్ఘంగా చర్చించారు.

మూడు జిల్లాల ముఖ్యనేతలతో

మూడు జిల్లాల ముఖ్యనేతలతో

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే పార్టీ నాయకులతో పన్నీర్ సెల్వం, ఆయన వర్గంలోని నాయకులు చర్చలు జరిపారు. శుక్రవారం జరిగే సభకు అన్నాడీఎంకే పార్టీ విశ్వాసులు, అమ్మ అభిమానులుతో సహ మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున జనం తరలించేందుకు ఏర్పాట్లు చేసి శశికళ వర్గంలో వణుకు పుట్టించాలని నిర్ణయించారు.

పన్నీర్ సెల్వం ప్రచారం రథం రెడీ

పన్నీర్ సెల్వం ప్రచారం రథం రెడీ

పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు ప్రచార రథం సిద్దమైంది. హంగూ ఆర్బాటాలు లేకుండా ద్రవిడ సిద్దాంత కర్త పెరియార్, ద్రవిడ పార్టీ అవిర్బావ కర్త అన్నా, అన్నాడీఎంకే పార్టీ అవిర్భావ అధ్యక్షుడు ఎంజీఆర్, అమ్మ జయలలిత చిత్రపటాలను ప్రచార రథంలో పొందుపరిచారు.

అమ్మ ఆశీస్సులతో ఉన్న పన్నీర్

అమ్మ ఆశీస్సులతో ఉన్న పన్నీర్

అమ్మ ఆశీస్సులు అందుకున్నట్లుగా పన్నీర్ సెల్వం ఫోటోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జయలలిత ఫోటోలు స్పష్టంగా కనపడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. జయలలిత ఆశయాలను శశికళ వర్గం నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పన్నీర్ సెల్వం తమిళనాడులోని 122 మంది ఎమ్మెల్యేల (శశికళ వర్గం) నియోజ వర్గాల్లో పర్యటించి ప్రచారం చెయ్యాలని ఆయన వర్గీయులు పక్కా ప్రణాళిక సిద్దం చేశారు.

English summary
Following MGR's precedence, Panneerselvam has prepared his prachar vehicle an open Mahindra jeep to tour the state he lost to VK Sasikala's loyalist Palaniswami following ten days of intense political drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X