పన్నీర్ సెల్వం సత్యాగ్రహం: అనుమతి ఇవ్వాలని, లేదంటే ?

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తున్నది. ఈనెల 8వ తేదిన జయలలిత సమాధి దగ్గర తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు ఉపవాస సత్యాగ్రహం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

జయలలిత సమాధి దగ్గర ఉపవాస సత్యాగ్రహం చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ సోమవారం పన్నీర్ సెల్వం వర్గీయులు చెన్నై నగర పోలీసు కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. అయితే చెనై నగర పోలీసు కమిషన్ మాత్రం అనుమతి ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

పన్నీర్ సెల్వం వర్గంలోని రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్, సీనియర్ నాయకులు కేపి. మునిసామి, నత్తం విశ్వనాథన్ సోమవారం మద్యాహ్నం చెన్నై నగర పోలీసు కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

 Panneerselvam and his planned for fasting protest demanding inquiry on jayalalitha's death.

పన్నీర్ సెల్వం, ఆయన వర్గీయులు ఇప్పటికే జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి జయలలిత మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని మనవి చేశారు. పన్నీర్ సెల్వం తాను అమ్మ సమాధి వద్ద ఉపవాస సత్యాగ్రం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.

పన్నీర్ సెల్వం దీక్ష చేసే సమయంలో అమ్మ అభిమానులు, అన్నాడీఎంకేలోని ఆయన వర్గీయులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే పన్నీర్ సెల్వం దీక్షకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అని వేచి చూడాలి అంటున్నారు అమ్మ అభిమానులు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఉపవాస సత్యాగ్రహం చెయ్యాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని ఆయన వర్గీయులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+