పోలీసులతో దౌర్జన్యమా, ఆపండి, లేదంటే ప్రజలే ! పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రజలు, అమ్మ జలలిత అభిమానుల మీద ప్రతాపం చూపించాడానికి ప్రయత్నిస్తున్నారని, అంది అంత మంచిదికాదని తాజా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరోపించారు.
శుక్రవారం ఆయన పోలీసు అధికారులకు లేఖ రాశారు. ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అమ్మ అభిమానులను అరెస్టు చెయ్యరాదని పోలీసు అధికారులకు పన్నీర్ సెల్వం మనవి చేశారు.

శశికళ మద్దతుదారులతో ఏర్పాటైన పళనిసామి ప్రభుత్వంపై తాము ధర్మయుద్దం చేస్తామని పన్నీర్ సెల్వం చెప్పారు. ప్రభుత్వం చేతకాని తనం ప్రదర్శించిన సమయంలో ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తారని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు.
అయితే ప్రభుత్వం మనచేతుల్లో ఉంది కదా అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తే ఎవ్వరికి మంచిదికాదని పరోక్షంగా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమ్మ ఫోటోలు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన వారు ఇప్పుడు అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం సిగ్గుచేటు అని పన్నీర్ సెల్వం మండిపడ్డారు.












Click it and Unblock the Notifications