సంచలనం: తల్లిదండ్రులను దూషిస్తే పిల్లలను గెంటేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
సీనియర్ సిటిజన్లను ఇబ్బంది పెడుతూ నిత్యం దూషించే పిల్లలను నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుండి తరిమివేయవచ్చని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: తల్లిదండ్రులను దూషించే పిల్లలను నిర్దాక్షిణ్యంగా ఇళ్ళ నుండి బయటకు పంపాలని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ ఇల్లు వారసత్వంగా వచ్చిందైనా, స్వంతంగా కొనుగోలు చేసిందైనా ఎలాంటి ఇబ్బందులు లేవని కోర్టు స్పష్టం చేసింది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రులను శారీరకంగా హింసించేవాళ్ళు లేదా మానసికరంగా వేధించే కొడుకులు, కూతుళ్ళను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 325 కు సవరణలు చేయాలని డిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్ళైనా అవ్వకపోయినా తల్లిదండ్రులు స్వంతంగా కష్టపడి సంపాదించుకొన్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు కూతుళ్ళకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని జస్టిస్ మన్మోహన్ చెప్పారు.
తల్లిదండ్రులకు , పిల్లలకు మద్య సంబంధాలు బాగున్నంతవరకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇంట్లో ఉండొచ్చని , అంతే తప్ప వాళ్ళకు భారంగా ఉండాలంటే మాత్రం కుదరదని చెప్పారు.












Click it and Unblock the Notifications