చనిపోయిన కొడుకు మృతదేహాన్ని ఉప్పు పాతరేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే!!
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలు ప్రబలంగానే ఉన్నాయని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ఇంకా మూడ నమ్మకాలు ఎంతగా మన సమాజంలో ఉన్నాయో అర్థమయ్యేలా చెప్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే

బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేసిన తల్లిదండ్రులు
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి తాలూకాలోని సిర్వారా గ్రామంలో ఓ బాలుడు గ్రామంలోని చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో 10 సంవత్సరాల వయసున్న సురేష్ మృతి చెందాడు . సురేష్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు తమ కుమారుడు తిరిగి వస్తాడని బలమైన మూఢ నమ్మకంతో బాలుడి మృతదేహం పాడు కాకుండా ఉప్పు పాతర వేశారు.

బాలుడి డెడ్ బాడీపై 5 బస్తాల ఉప్పు పోసి, బ్రతుకుతాడని ఎనిమిది గంటల నిరీక్షణ
బాలుడి మృతదేహంపై ఐదు బస్తాల ఉప్పును పోసి, ఎనిమిది గంటలపాటు బాలుడు తిరిగి వస్తాడని ఎదురు చూశారు. చనిపోయిన వారు తిరిగి వస్తారని ఎవరో చెప్పగా విన్న తల్లిదండ్రులు మూఢ నమ్మకంతో ఈ పని చేశారు. అయితే కొడుకు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇక ఈ విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి రారని, అలా చనిపోయిన వారిని బ్రతికించడం సాధ్యం కాదని వారికి అర్థమయ్యేలా చెప్పారు.

చనిపోయిన వారు బ్రతుకుతారని గతంలోనూ అనేక ఘటనలు
మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి అధికారులు తల్లిదండ్రులను ఒప్పించారు. చివరకు తల్లిదండ్రులు మృతదేహాన్ని దహనం చేశారు. ఇక గంతంలోనూ ఇలాంటి ఘటనలే అనేకం జరిగాయి. చనిపోయిన వారు బ్రతికి వస్తారని అనేక చోట్ల అనేక రకాలుగా చిత్ర, విచిత్రమైన పనులు చేసిన వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే గతంలో ఆగష్టు 19న, మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలోని భితి గ్రామానికి చెందిన వందలాది గ్రామస్తులు, చనిపోయిన బిడ్డను తిరిగి బతికించే ప్రయత్నంలో, బాలుడి ఎముకతో, సమాధి చేసిన మట్టితో రేవా జిల్లాలోని బక్షేరా గ్రామంలోని కులదేవి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని పూజించారు. భజనలు, కీర్తనలు చేశారు.

గతంలో మధ్యప్రదేశ్ లోనూ చనిపోయిన బాలుడు బతుకుతాడని మూఢనమ్మకం
చనిపోయిన కుటుంబంలో ఒకరు తన కలలో కుల దేవతని స్వయంగా చూసినట్లు, చనిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించటానికి చనిపోయిన బిడ్డ సమాధి స్థలంలోని మట్టిని దేవత పాదాల వద్ద వేయమని చెప్పింది అని చెప్పడంతో గ్రామస్తులు మూఢనమ్మకంతో హంగామా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చనిపోయిన కుమారుడు తిరిగి బతుకుతాడని తల్లిదండ్రులు కుమారుడిని ఉప్పు పాతర వేసిన సంఘటన చోటు చేసుకుంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications