కూతురిని వ్యభిచారంలోకి నెట్టిన తల్లిదండ్రులు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతుర్ని ఆమె తల్లిదండ్రులు చిత్ర హింసలకు గురి చేశారు. అంతటితో ఆగక బలవంతంగా ఆమెను వ్యభిచార రొంపిలోకి దించారు. దీంతో ఆ బాధలు భరించలేని 17 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది.
తల్లి నిర్మలా శర్మ, తండ్రి సంజయ్ శర్మ తనను వేధించడంతో పాటు వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్న కూతురిపై చేస్తున్న దారుణాలపై ప్రశ్నిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వాణీ జిల్లా మహావీర్ నగర్‌కు చెందిన సంజయ్ శర్మ, నిర్మల అనే ఆ ఘాతుకానికి ఒడిగట్టారు. దీంతో ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దంపతులను అరెస్టు చేసింది. వీరిద్దరిపై హత్యా బెదిరింపు, దాడిచేయడం, సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదిలావుంటే, ఈ బాలిక గతంలో ఇండోర్‌లో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తుండగా, బలవంతంగా చదువు మాన్పించి బర్వాణీకి తీసుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ యువతి చాకచక్యంగా తమ బంధువులకు సమాచారం చేరవేసి.. తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని మానప్రాణాలను కాపాడుకుంది.












Click it and Unblock the Notifications