పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్: నిందితుల్లో ముగ్గురు దోషులే
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో కదులుతున్న కారులో 37 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో కోల్‌కతా సెషన్ కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది. సంఘటన జరిగిన మూడున్నర ఏళ్లకు కోర్టు తీర్పు వెలువడింది.
ఐదుగురు నిందితుల్లో సుమిత్ బజాడ్, రుమన్ ఖాన్, నసీర్ ఖాన్‌లను కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. గురువారం సాయంత్రం వారికి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. 2012 ఫిబ్రవరి 6వ తేదీన నిందితులు మహిళపై అత్యాచారం చేశారు.
పార్కు స్ట్రీట్‌లోని నైట్ క్లబ్‌లో ఆమెతో స్నేహం చేసి ఆ తర్వాత అత్యాచారం జరిపారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ బాధితురాలు ఈ ఏడాది మార్చి 13వ తేదీన మరణించింది. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు.

పార్క్ స్ట్రీట్ సామూహిక అత్యాచార సంఘటన విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసిన కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆమె అనడంపై తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయగలిగారు. ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్‌ను అరెస్టు చేయడంలో విఫలమయ్యారు. సంఘటన జరిగిన వెంటనే ఖాదర్ ముంబైకి పారిపోయాడు. రెండేళ్ల పాటు ఇన్ కెమెరా విచారణ జరిగింది. 45 మంది సాక్షులను విచారించారు.












Click it and Unblock the Notifications