12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన అఫ్జల్ గురు కుమారుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురు కుమారుడు గాలి గురు సెకండరీ స్కూల్ పరీక్షల్లో సత్తా చాటాడు. డిస్టింక్షన్‌లో అతను ఉత్తీర్ణుడయ్యాడు. పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే

అఫ్జల్ గురు కుమారుడికి 12వ తరగతి పరీక్షల్లో 88 శాతం మార్కులు వచ్చాయి. పరీక్షా ఫలితాలను గురువారంనాడు కాశ్మీర్ పాఠశాల విద్య బోర్డు అధికారులు వెల్లడించారు. నవంబర్‌లో జరిగిన పరీక్షలకు 55,163 మంది హాజరు కాగా 33,893 మంది ఉత్తీర్ణులయ్యారు.

Parliament attack convict Afzal Guru's son scores 88 per cent in class 12 exam

మొత్తం 61.44 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 64.31 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 58.92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురుకు పదో తరగతిలో 95 శాతం మార్కులు సాధించాడు. ఐదు సబ్జెక్టుల్లో ఎ1 గ్రేడ్ వచ్చింది. బారాముల్ల జిల్లా సోపోర్‌లోని ఆయన గృహానికి మిత్రులు, కుటుంబ సభ్యులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా అతనికి శుభాకాంక్షలు అందుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికార ప్రతినిధి ట్విట్టర్‌లో అతనికి అభినందలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Parliament attack convict Afzal Guru's son Galib Guru has passed the higher secondary school examination with a distinction.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి