నేటినుండే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రేపే బడ్జెట్; ఆ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత!!

ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు మొదలుకానున్నాయి. 17వ లోక్సభ చివరి బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. అయితే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను 10 రోజులపాటు నేటి నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇక నేడు సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో ఈ సమావేశాలను ప్రశాంతంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.

Parliament Budget Sessions from Today: Budget on Tomorrow; Suspension revoked on those MPs!!

అయితే ఈ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది. ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న మధ్యంతర బడ్జెట్ లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుత సమావేశాలలో మొత్తం 19 బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత శీతాకాల సమావేశాలలో లోక్సభ, రాజ్యసభ లకు చెందిన మొత్తం 146మంది ప్రతిపక్ష పార్టీలు ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. అయితే వారిలో 132మందిని ఆ సెషన్ వరకే పరిమితం చేశారు. అయితే మిగతా 14మంది సభ్యులలో ముగ్గురు లోక్ సభ సభ్యులు కాగా, మిగతా 11మంది రాజ్య సభ సభ్యులు.

అయితే వీరి సస్పెన్షన్ అంశాన్ని ఉభయ సభల ప్రివిలేజ్ కమిటీకి పంపగా జనవరి 12వ తేదీన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముగ్గురు లోక్సభ సభ్యుల పైన పెన్షన్లు ఎత్తివేసింది. ఇక తాజాగా రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్ కమిటీ 11 మంది సభ్యుల పైన నిన్న సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో నేటి నుండి వారంతా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+