Parliament Mansoon session Day 15 : ఉభయసభల్లో ప్రైవేట్ బిల్లులు-రాజ్యసభలో ఆరోగ్య బిల్లు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 15వ రోజు కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ఉభయ సభలు ప్రారంభమైన తొలి గంటలోనే వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశం కాగానే రాజ్యసభ ఉదయం 11.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా, లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. తిరిగి సమావేశమైన తర్వాత ఎగువ సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎన్నిక కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఈశాన్య సరిహద్దు రైల్వేలో నియామకాలపై చర్చించింది. మరోవైపు లోక్‌సభ మళ్లీ సమావేశమైన తర్వాత ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నప్పటికీ జీరో అవర్‌ను చేపట్టారు. పునఃప్రారంభమైన తర్వాత లోక్‌సభ శక్తి పరిరక్షణ (సవరణ) బిల్లు 2022పై చర్చించగా, రాజ్యసభ ఆరోగ్య హక్కు బిల్లు 2021ని పరిగణనలోకి తీసుకుంది. అనంతరం ఉభయ సభలు అనేక ప్రైవేట్ సభ్యుల బిల్లుల్నీ స్వీకరించాయి.
ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ ప్రవేశపెట్టిన నిర్బంధ ఓటింగ్ బిల్లు 2019ని లోక్‌సభ పరిశీలించి ఆమోదించింది.ఓటు వేయని వారిపై జరిమానా విధించడం సాధ్యం కాదనే అంశాలను పలువురు సభ్యులు లేవనెత్తారు. అలాగే ఓటు వేయలేని ఉపాధి హామీ ఉద్యోగుల వంటి ఓటర్లు ఇందులో ఉంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఈ నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించాయని, అయితే ఇది ప్రజలకు అనుకూలంగా లేదని ఆ దేశాలు త్వరగా గ్రహించి వ్యవస్థను వెనక్కి తీసుకున్నాయని ఎంపీలు చెప్పారు.

లోక్‌సభ ఎంపీలు సైనిక శిక్షణను తప్పనిసరి చేయడానికి, అభ్యంతరకరమైన మతపరమైన విషయాలను ప్రచురించడాన్ని నిషేధించడానికి, వికలాంగులకు ప్రత్యేక చర్యలను అందించడానికి ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు.మరోవైపు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. ఇందులో రాజధానుల నిర్ణయాధికారం అసెంబ్లీకే ఇచ్చేలా రాజ్యాంగ సవరణ కోరారు. అలాగే నకిలీ వార్తల అడ్డుకట్టకు ప్రెస్ కౌన్సిల్ కు అధికారాలు ఇచ్చేలా చట్టసవరణ చేయాలని మరో బిల్లు పెట్టారు.
అలాగే ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటూ కస్టడీలో ఉన్నా లేదా అరెస్టైన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యుడు రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ కోరుతూ విజయసాయి రెడ్డి మరో ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వీటిని సభ చర్చకు తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications