నువ్వా-నేనాః జీఎస్టీపై విప‌క్షాలు భ‌గ్గు, బీజేపీ కౌంటర్: దద్దరిల్లుతున్న పార్లమెంట్: నిరసనలు, వాయిదాలు

న్యూఢిల్లీః ఇవ్వాళ్టి నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు వీ విజ‌య‌సాయి రెడ్డి. ఆయ‌న‌తో పాటు కొత్త‌గా నామినేట్ అయిన ప‌లువురు సభ్యులు ఇవ్వాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ లోక్ స‌భ స‌భ్యులు దినేష్ లాల్ నిరాహువా యాద‌వ్ (ఆజ‌మ్ గ‌ఢ్-ఉత్త‌ర ప్ర‌దేశ్), ఘ‌న్ శ్యామ్ సింగ్ లోధీ (రామ్ పూర్-ఉత్త‌ర ప్ర‌దేశ్), టీఎంసీ స‌భ్యుడు శత్రుఘ్న సిన్హా (అస‌న్ సోల్-ప‌శ్చిమ‌బెంగాల్) ప్ర‌మాణ స్వీకారం చేశారు. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌, జీఎస్టీ రేట్ల స‌వ‌ర‌ణ‌, వాటి శ్లాబుల్లో మార్పులు చేయ‌డం..

వంటి అంశాలు ఈ సారి పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను కుదిపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇవ్వాళ్టి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన కొత్త జీఎస్టీ శ్లాబుల మీద రాజ్య‌స‌భ‌లో అప్పుడే తీవ్ర ఆందోళ‌న సైతం చెల‌రేగింది. స‌భ్యులు పోడియం వైపు దూసుకెళ్లారు. దీనితో ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు స‌భ‌ను రేప‌టియి వాయిదా వేశారు. ఉభ‌య స‌భ‌ల్లో చోటు చేసుకునే ప‌రిణామాలు, చ‌ర్చ‌కు వ‌చ్చే అంశాలు, బిల్లుల‌పై ఎప్పటికప్పుడు తాజా స‌మాచారం మినిట్ టు మినిట్ మీకోసం..

Parliament monsoon sessions live updates: More than twenty bills to be tabled.

Aug 08, 2022, 4:06 pm IST
ఢిల్లీ

తనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎంతో బాధపడ్డాను. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీతో కొనసాగిన అనుబంధాన్ని తెంచుకోవాలంటే బాధగా అనిపించింది- రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
Aug 08, 2022, 4:00 pm IST
ఢిల్లీ

రాజ్యసభకు పెద్దలసభ అనే గౌరవం ఉందని, దానికి అనుగుణంగా సభ్యులు నడచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు. ప్రపంచం మొత్తం పెద్దల సభ వైపు చూస్తుంటుందని చెప్పారు.
Aug 08, 2022, 3:48 pm IST
ఢిల్లీ

మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం రాజ్యసభ మళ్లీ సమావేశమైంది. ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు సభను ఉద్దేశించి మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
Aug 08, 2022, 1:01 pm IST
ఢిల్లీ

ఈ నెల 11వ తేదీన కొత్త ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున వెంకయ్య నాయుడి పదవీ కాలం ముగుస్తుంది.
Aug 08, 2022, 12:45 pm IST
ఢిల్లీ

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీడ్కోలు సందర్భంగా రాజ్యసభలో మాట్లాడుతున్న వివిధ పార్టీల సభ్యులు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటోన్నారు.
Aug 08, 2022, 12:18 pm IST
ఢిల్లీ

ఉప రాష్ట్రపతి వీడ్కోలు సందర్భంగా ప్రసంగిస్తోన్న రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. రాజ్యసభ ఛైర్మన్‌గా కొన్ని కంప్లైంట్లు ఉన్నాయని, వాటిని ఇప్పుడు ప్రస్తావించడం సరికాదని పేర్కొన్న ఖర్గే.
Aug 08, 2022, 12:15 pm IST
ఢిల్లీ

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో తనకు ఉన్న అనుబంధాన్ని పార్లమెంట్ సాక్షిగా గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పార్టీలో, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసలు.
Aug 08, 2022, 12:14 pm IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు 55 పతకాలను సాధించిందని పేర్కొన్న స్పీకర్ ఓం బిర్లా. ఇందులో పసిడి-18, వెండి-15, రజతం-22 పతకాలు ఉన్నాయని సభకు తెలిపిన స్పీకర్.
Aug 08, 2022, 12:01 pm IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో పతకాలను సాధించిన భారత అథ్లెట్లు, క్రీడాకారులను అభినందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.
Aug 08, 2022, 11:59 am IST

రాజ్యసభ ఛైర్మన్ వీడ్కోలు సందర్భంగా పార్లమెంట్‌లో ప్రసంగిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
Aug 08, 2022, 11:08 am IST
ఢిల్లీ

పదవీ విరమణ చేయనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాదపూరకంగా కలుసుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
Aug 08, 2022, 10:08 am IST
ఢిల్లీ

విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పారామిలటరీ జవాన్లకు అమరవీరుల హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభలో సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్.
Aug 08, 2022, 9:44 am IST
ఢిల్లీ

దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగంపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్.
Aug 05, 2022, 1:07 pm IST
ఢిల్లీ

పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో సభ్యులకు ఈడీ నోటీసులను జారీ చేయడంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు.
Aug 05, 2022, 12:16 pm IST
ఢిల్లీ

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పీ చిదంబరం, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ సభ్యులు నల్లచొక్కాలను ధరించి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
Aug 05, 2022, 11:56 am IST

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తోన్న కాంగ్రెస్ సభ్యులు.
Aug 05, 2022, 11:54 am IST
ఢిల్లీ

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ సభ్యుల నిరసన.
Aug 05, 2022, 9:36 am IST
ఢిల్లీ

నిరుపేద రోగుల కోసం ప్రతి బోగీలో ఒక బెర్త్‌ను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభలో జీరో అవర్ నోటీస్ ఇచ్చిన బీజేపీ సభ్యుడు సకాల్‌దీప్ రాజ్‌భర్.
Aug 05, 2022, 9:22 am IST
ఢిల్లీ

వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్.
Aug 05, 2022, 8:35 am IST

సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ హిందీలో, హైకోర్టుల కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లో సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభలో జీరో అవర్ నోటీస్ ఇచ్చిన బీజేపీ సభ్యుడు హర్నథ్ సింగ్ యాదవ్.
Aug 05, 2022, 8:19 am IST
ఢిల్లీ

కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్‌ను ప్రవేశపెట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ ఛద్దా.
Aug 03, 2022, 10:46 am IST
ఢిల్లీ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాడులపై చర్చించాలని కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన కాంగ్రెస్ సభ్యుడు కోడికున్నిల్ సురేష్.
Aug 02, 2022, 2:53 pm IST
ఢిల్లీ

ఏపీలోని మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌కు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని లోక్‌సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి
Aug 02, 2022, 2:12 pm IST
ఢిల్లీ

పునఃసమావేశమైన రాజ్యసభ. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై లఘు చర్చ ప్రారంభం. కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు ఇలామరం కరీం చర్చను ప్రారంభించారు.
Aug 02, 2022, 1:06 pm IST
ఢిల్లీ

మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన లోక్‌సభ.
Aug 02, 2022, 11:23 am IST
ఢిల్లీ

మధ్యాహ్నానికి వాయిదా పడ్డ రాజ్యసభ.
Aug 02, 2022, 10:24 am IST

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్రమంత్రులు, ఎంపీలు దీనికి హాజరయ్యారు.
Aug 02, 2022, 10:15 am IST
ఢిల్లీ

పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.
Aug 02, 2022, 10:11 am IST
ఢిల్లీ

దేశంలో నానాటికీ పెరుగుతోన్న నిరుద్యోగ సమస్యపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్
Aug 02, 2022, 10:07 am IST
ఢిల్లీ

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసర సరుకులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గె
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+