వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షెడ్యూల్ కన్నా ముందే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు: 7 బిల్లులకు ఆమోదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. షెడ్యూల్ కంటే వారం రోజుల ముందే లోక్‌సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈసారి మొత్తం 13 రోజులపాటు సభ కొనసాగింది. 97 శాతం పనితీరు సాధించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ముగింపు ప్రసంగంలో వెల్లడించారు. ఈ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. వీటిలో యాంటీ పైరసీ బిల్లు కూడా ఉంది.

మరోవైపు, శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ 102 శాతం పనితీరు కనబర్చిందని ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ వెల్లడించారు. 13 రోజులపాటు జరిగిన సమావేశాల్లో 64 గంటల 50 నిమిషాలు సభ సాగిందన్నారు. శీతాకాల సమావేశాల్లో వైల్డ్ లైఫ్ అమెండ్మెంట్ బిల్లు, ఇంధన సంరక్షణ బిల్లు సహా ఏడు బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయని తెలిపారు. సభలో విపక్ష సభ్యలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఛైర్మన్.. వారి తీరు వల్ల ఒక గంట 45 నిమిషాలు విలువైన సమయం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Parliament Winter Session 2022: Both Houses adjourned sine die one week before schedule, 7 bills approved.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖాల్లి ర్జున ఖర్గే
కేంద్రమంత్రులు రాజ్ థ్ సింగ్, పీయూష్ గోయల్ తదితరులు పార్లమెం ర్ల ట్ శీతాకాల సమావేశాల చివరి రోజున సభకు హాజరయ్యారు.

డిసెంబరు 7న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29వరకు జరగాల్సి ఉంది. అయితే క్రిస్మ స్, న్యూ ఇయర్ వేడుకల కారణంగా సమావేశాలని షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని సభాపతి ఓం బిర్లా అధ్యక్షతన ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ పార్టీల
నేతలు హాజరైన సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సభ పనిదినాలను కుదించాలని నిర్ణయం ర్ణ తీసుకున్నారు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరపాలని
పలుమార్లు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఈ అంశంపై ప్రభుత్వం చర్చకు ఒప్పుకోలేదు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

English summary
Parliament Winter Session 2022: Both Houses adjourned sine die one week before schedule, 7 bills approved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X