ఫేస్ బుక్ జుకర్ బర్గ్ కు మోడీ సమన్లు- పార్లమెంట్ కు సారీ కోరుతూ..!
సోషల్ మీడియా సంస్థలతో కేంద్రానికి ఉన్న వైరం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎక్స్, మెటాతో పాటు పలు సంస్థల సాయంతో విపక్షాలు తమను టార్గెట్ చేస్తున్నట్లు భావిస్తున్న బీజేపీ.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఐటీ చట్టంలో రూల్స్ ను సైతం మార్చింది. అయినా ప్రయోజనం లేదని భావిస్తున్న కేంద్రం.. ఇప్పుడు పార్లమెంటరీ పద్ధతుల్లో వాటి బాస్ లను టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగా మెటా (ఫేస్ బుక్) బాస్ మార్క్ జుకర్ బర్గ్ కు నోటీసులు పంపబోతోంది.
గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్లమెంట్ ను క్షమాపణ చెప్పాలని కోరుతూ సమన్లు పంపబోతున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్లపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ నిషికాంత్ దూబే ఎక్స్ లో పోస్టు పెట్టారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో ఈ సమన్లు పంపబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z
— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025
ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం దాని ప్రతిష్టను దెబ్బతీస్తుందని,ఈ తప్పుకు సదరు సంస్థ (మెటా) పార్లమెంటుకు , ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నిషికాంత్ దూబే ఎక్స్ లో పెట్టిన పోస్టులో తెలిపారు. జనవరి 10న జరిగిన పాడ్‌కాస్ట్‌లో, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు అయిన జుకర్ బర్గ్.. కరోనా ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయేలా చేసిందన్నాడు. దీనికి భారత్ ను ఉదాహరణగా చూపాడు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయన్నాడు. దీనిపై ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ జుకర్ బర్గ్ కు సమన్లు పంపబోతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు జుకర్ బర్గ్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ కౌంటర్లు ఇచ్చారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications