Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్ నాథ్ సింగ్ ఇంటికి కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

న్యూఢిల్లీ :పుల్వామా ఉగ్రదాడిని అఖిలపక్షం ఖండించింది. సరిహద్దులో ఉగ్రవాదుల దుశ్చర్యలను సహించబోమని తీర్మానం చేసింది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, టీఎంసీ సుదీప్ బంద్యోపాధ్యాయ్, డెరెక్ ఒబ్రెయిన్, శివసేన నుంచి సంజయ్ రౌత్, టీఆర్ఎస్ నుంచి జితేందర్రెడ్డి, సీపీఐ నుంచి డీ రాజా, అకాలీదల్ నుంచి నరేష్ గుజ్రాల్, ఆర్ఎస్ఎల్పీ నుంచి ఉపేంద్ర కుస్వాలా, జై ప్రకాశ్ నారాయణ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. ఉగ్రదాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ అఖిలపక్షం తీర్మానం చేసింది.

ఈ నెల 14న అవంతిపొర వద్ద జరిగిన దాడి పిరికిపంద చర్య, ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం .. సరిహద్దుల్లో ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పేకలిస్తాం' అని చేసిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేసింది.మీ వెన్నంటే .. ఉన్నాం ...

All party meeting begins in delhi to deliberate on pulwama attack live updates

Feb 16, 2019, 7:00 pm IST

జమ్ముకశ్మీర్ ... రాజౌరిలో పేలుడు ..ఐఈడీ బాంబు పేలుడుతో మేజర్ మరణం
Feb 16, 2019, 6:30 pm IST

హిమాచల్ ప్రదేశ్ .. కంగ్రాలోని ద్వెవాలోని జవాను తిలక్ రాజ్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్రమంత్రి జేపీ నడ్డా
Feb 16, 2019, 6:29 pm IST

కాల్పుల విమరణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచిన పాకిస్థాన్
Feb 16, 2019, 6:28 pm IST

దేశం కోసం సైనికులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు .. మహారాష్ట్ర సభలో మోదీ
Feb 16, 2019, 5:46 pm IST

కశ్మీర్ లో వీరజవాను నసీర్ అహ్మద్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
Feb 16, 2019, 5:46 pm IST

కశ్మీర్ లో వీరజవాను నసీర్ అహ్మద్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
Feb 16, 2019, 5:27 pm IST

జమ్ముకశ్మీర్ ... రాజౌరిలో పేలుడు ..ఐఈడీ బాంబు పేలుడుతో మేజర్ మరణం
Feb 16, 2019, 5:14 pm IST

రాజ్ నాథ్ సింగ్ ఇంటికి చేరుకున్న కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
Feb 16, 2019, 5:13 pm IST

భువనేశ్వర్ లో పీకే సాహు పార్థీవదేహనికి అంత్యక్రియలు
Feb 16, 2019, 5:12 pm IST

కపిల్ శర్మ షో నుంచి సిద్దూ ఔట్ .. దేశం, మతం ఉగ్రవాదానికి అతీతం కాదనే వ్యాఖ్యలతో బహిష్కరణ.
Feb 16, 2019, 5:12 pm IST

ప్రతి కన్నీటి చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటాం.. మహారాష్ట్ర సభలో మోదీ తీవ్ర వ్యాఖ్యలు
Feb 16, 2019, 5:12 pm IST

బీహార్ లో రతన్ కుమార్ కు తుది వీడ్కోలు పలికిన స్థానికులు. భారతమాత కోసం మరో కొడుకును ఇస్తానని .. కానీ పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన తండ్రి కోరిన సంగతి తెలిసిందే.
Feb 16, 2019, 5:11 pm IST

వీర జవాన్ల కోసం నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Feb 16, 2019, 3:53 pm IST

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఏపీ సర్కార్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Feb 16, 2019, 3:52 pm IST

పుల్వామా దాడుల నేపథ్యంలో కశ్మీర్ విద్యార్థులు, స్థానికులు బెదిరింపులు ఎదుర్కొంటున్నారని .. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ ఆదేశం
Feb 16, 2019, 3:46 pm IST

సమావేశానికి హాజరైన రా చీఫ్ ధస్మానా, ఇంటెలెజెన్స్ అడిషనల్ డైరెక్టర్ అరవింద్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌవ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
Feb 16, 2019, 3:45 pm IST

ఢిల్లీ.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
Feb 16, 2019, 3:41 pm IST

ప్రయాగ్ రాజ్ .. కానిస్టేబుల్ మహేశ్ కుమార్ కు ఆశ్రునయనాలతో వీడ్కోలు పలికిన స్థానికులు
Feb 16, 2019, 3:40 pm IST

ఉగ్రదాడిలో ఆసువులు బాసిన జవాన్ల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన
Feb 16, 2019, 3:34 pm IST

పుల్వామా దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తుంటే పాక్ మీడియా మాత్రం ఉగ్ర మూక ఆదిల్ ను మాత్రం పొగిడేసి .. తన నైజాన్ని బయటపెట్టింది
Feb 16, 2019, 3:32 pm IST

ఛత్తీస్ గఢ్ .. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలకు మనం సంతాపం తెలుపాలన్న రాహుల్ గాంధీ.
Feb 16, 2019, 3:30 pm IST

పాట్నా .. సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హాకు తుది వీడ్కోలు పలికిన ఆశేష జనవాహిని
Feb 16, 2019, 3:27 pm IST

తమిళనాడు .. వీరజవాను సీ శివచంద్రన్ పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
Feb 16, 2019, 3:24 pm IST

రాజస్థాన్ .. వీర జవాను రోహితష్ లాంబా పార్థీవదేహానికి స్వస్థలంలో జనం నీరాజనం
Feb 16, 2019, 3:23 pm IST

పుల్వామా దాడిపై తీసుకునే చర్యలు .. పఠాన్ కోట్, యురి దాడులు చేసిన ఉగ్రవాదులపై తీసుకోవాలన్న శివసే నేత సంజయ్ రౌత్
Feb 16, 2019, 3:21 pm IST

యూపీ.. మహరాజ్ గంజ్ లో జవాను పంకజ్ కుమార్ త్రిపాఠి అంతిమయాత్ర
Feb 16, 2019, 3:19 pm IST

మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో వీరజవాను ఆశ్వని కొచ్చి పార్థీవదేహానికి ఆశ్రునివాళి
Feb 16, 2019, 3:15 pm IST

ఉగ్ర దాడిని నిరసిస్తూ ముంబైలోని నల్లసపోర రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనకారుల నిరసన .. చెదరగొట్టిన పోలీసులు
Feb 16, 2019, 3:15 pm IST

ఉగ్ర దాడిని నిరసిస్తూ ముంబైలోని నల్లసపోర రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనకారుల నిరసన .. చెదరగొట్టిన పోలీసులు
Feb 16, 2019, 1:15 pm IST

సరిహద్దులో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండన
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+