పఠాన్‌కోట్ టెర్రర్ దాడి: జనవరి 1 కోసమే ప్లాన్ చేశారు
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన దాడి కేసులో విచారణలో షాకింగ్ విషయం తెలిసిందే. శనివారం ఉదయం పఠాన్‌కోట్‌లో జరిగిన దాడిపై విచారణ జరుగుతోంది. ఉగ్రవాదులు ఈ దాడిని జనవరి 1నే చేయాలని ప్లాన్ చేసుకున్నారని విచారణలో తేలింది.
ఉగ్రవాదులు అందరు కూడా గత ఏడాది డిసెంబర్ 30వ తేదీనే వచ్చారని తేలింది. విచారణలో పంజాబ్ పోలీసులకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఐబీ), జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)లు సహకరిస్తున్నాయి.
ఈ దాడిని భావల్పూర్‌లో ప్లాన్ చేశారు. ఇక్కడే జైష్ ఈ మహ్మద్ చీఫ్ మౌలానా మసూర్ అజార్ నివాసం ఉంది. తొలుత దాడికి పాల్పడిన వారిని ఖతువా - గురుదాస్‌పూర్ సెక్టార్ వచ్చారు. అక్కడి నుంచి కాలి నడక ద్వారా భారత్‌లో అడుగు పెట్టారని తెలుస్తోంది.

కాగా, పఠాన్ కోట్ దాడిలో శనివారం నాడు ముగ్గురు భద్రతా సిబ్బంది కన్నుమూశారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడిలో గాయపడ్డ మరో భద్రతా సిబ్బంది చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌కు చెందిన లెఫ్టినెట్ కల్నల్ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆసుపత్రిలో మరో ముగ్గురు కూడా చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది.












Click it and Unblock the Notifications