కూలిన హెలికాప్టర్ పైలట్ మృతదేహం లభ్యం
ముంబై: ఐదు రోజుల క్రితం ప్రమాదానికి గురైన పవన్ హాన్స్ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ గల్లంతైన ఇద్దరు పైలెట్లలో ఒకరి మృతదేహం మంగళవారం లభించింది. మృతదేహం కెప్టెన్ గుహదిగా కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అరేబియా సముద్రంలో పవన్ హాన్స్ హెలికాఫ్టర్ గత బుధవారం రాత్రి గల్లంతైన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్‌లు గల్లంతయ్యారు. వీరిలో కెప్టెన్ సామ్యూల్ ఆచూకీ ఇంకా లభించలేదు.
సామ్యూల్ ఆచూకీ కోసం నావీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఓఎన్జీసీకి చెందిన ప్రముఖులను ముంబై నుండి తీర ప్రాంతంలోని తమ కంపెనీ క్షేత్రానికి తరలించడానికి పవన్ హాన్స్ హెలికాఫ్టర్లను వాడుతోంది.












Click it and Unblock the Notifications