వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మద్దతు: భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: జనసేన చీఫ్, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోడీతో సమావేశానంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశానికి కాబోయే ప్రధాని మోడీయేనని ఆయన అన్నారు. మోడీతో ఆయన దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమై తన జనసేన పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.

తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, అధికారం కోసం కూడా చూడడం లేదని, తనకు అధికార వ్యామోహం లేదని ఆయన అన్నారు. సూరత్‌లోని తెలుగువాళ్లంతా ఐక్యంగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోని తెలుగువాళ్లందరినీ ఎందుకు ఐక్యంగా ఉంచలేకపోయారని మోడీ అడిగినట్లు ఆయన తెలిపారు. రెండు ప్రాంతాల్లో విద్వేషాలు మంచివి కావని ఆయన అన్నారు.

విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని చీల్చారని, మోడీ లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకునే స్థానంలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లో నెలకొన్న విభేదాల వల్ల దేశసమగ్రతకు ప్రమాదం ఏర్పడుతుందనీ రెండు ప్రాంతాల మధ్య ఐక్యత లేకపోతే దేశానికి మంచిది కాదనీ మోడీ అన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. మోడీకి మద్దతు తెలపడం కోసమే తాను అహ్మదాబాద్ వచ్చినట్లు ఆయన తెలిపారు. మోడీని ప్రధానిని చేయడానికి తాను, తన పార్టీ కృషి చేయనున్నట్లు పవన్ తెలిపారు. మన దేశానికి మోడీ లాంటి వ్యక్తి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏమేం కావాలో మోడీకి చెప్పానని, ప్రధాని అయితే రెండు ప్రాంతాలకు చేయాల్సిన కార్యక్రమాల గురించి తాను వివరించారనని ఆయన చెప్పారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, అధికారంపై ఆసక్తి లేదని ఆయన చెప్పారు.

మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

జనసేన చీఫ్, తెలుగు సినిమా హీరో పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. మోడీని బలపరచడానికే తాను అహ్మదాబాద్ వచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

మీడియాతో పవన్ కళ్యాణ్..

మీడియాతో పవన్ కళ్యాణ్..

రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలను తాను మోడీకి వివరించానని, ప్రధాని అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చేయాల్సిన కార్యక్రమాల గురించి చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు.

అధికార దాహం లేదు..

అధికార దాహం లేదు..

తనకు అధికారంపై ఆసక్తి లేదని, రాష్ట్రాన్ని విభజించిన తీరు తనను బాధించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. విధివిధానాలు లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్శించారు.

కాసేపు మాట్లాడారు..

కాసేపు మాట్లాడారు..

మీడియాతో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో భేటీ తర్వాత శుక్రవారం కాసేపు మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అవుతారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు.

పోటీ చేస్తానో లేదో..

పోటీ చేస్తానో లేదో..

తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని, ఇంకా ఆ విషయంపై నిర్ణయం తీసుకోలేదని మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పారు.

కలిసి పనిచేయాలని..

కలిసి పనిచేయాలని..

రాష్ట్ర రాజకీయాల్లో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

మోడీ లాంటి వ్యక్తి అవసరం

మోడీ లాంటి వ్యక్తి అవసరం

దేశానికి మోడీ లాంటి నాయకుడి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మోడీ లాంటి నేత ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.

English summary
After meeting with BJP PM candidate Narendra Modi, Jana Sena chief Pawan Kalyan extended support to BJP in coming election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X