కాంగ్రెస్ లేని కూటమితో బీజేపీని ఓడించలేం.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీల నేతలను వరుసగా కలుస్తున్నారు. వారి మద్దతు కూడగడుతున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్ని ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెబుతున్నారు. అయితే కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు.
Recommended Video

1బీజేపీని ఓడించడం థర్డ్ ప్రంట్‌తో సాధ్యం కాదు
బీజేపీని ఓడించడం థర్డ్ ప్రంట్‌తో సాధ్యం కాదని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టించిందని దుయ్యబట్టారు. మౌలిక పునాదులను పెకిలించిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో సామాన్యులు ఒరిగిందేమి లేదన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్నారు. ఎన్నికల జరిపించడం ద్వారా కశ్మీర్ ప్రజలకు ఏదో మేలు చేస్తున్నందన్న భావనలో బీజేపీ ఉందన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలతో ఎంతో మంది దుర్భర జీవితం గడుపుతున్నారని ఆరోపించారు.

2 కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం
దేశంలో కాంగ్రెస్ పార్టీ మినహా ప్రత్యామ్నాయం లేదని మెహబూబా ముప్తీ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. అలాంటిది.. కాంగ్రెస్ లేని రాజకీయ కూటమితో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ లేని కూటమి, ఫ్రంట్ బీజేపీతో యుద్దం చేయలేదని చురకలంటించారు.

ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలి
కాషాయపార్టీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రతిపక్షపార్టీలన్ని ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ముప్తీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశ లౌకిక రూపాన్ని మార్చేందుకు కుట్రచేస్తోందని ఆరోపించారు. ప్రజల్లో బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత వస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications