తొందరలేదు: ముఫ్తీ, షాకిచ్చిన అమిత్-ఒమర్, జార్ఖండ్ సీఎం రేస్‌లో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ షాకిచ్చారు. తాము పీడీపీకి మద్దతిచ్చేందుకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం తెలిసిందే. దానిపై ముఫ్తీ మొహమ్మద్ మంగళవారం స్పందించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఎలాంటి తొందర లేదని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అంచనాల మేరకు ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయ ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తామని చెప్పారు.
పీడీపీ, ఎన్సీపీతో సిద్ధమని అమిత్ షా

ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి పీడీపీ షాకివ్వగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తుకు తాము సిద్దమని ప్రకటించారు.
పొత్తులకు అన్ని దారులు తెరిచే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి బయటి నుండి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‍లో గతంతో పోలిస్తే బీజేపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ లభించిందని, 25 స్థానాలు సాధించి తాము కీలక స్థానంలో ఉన్నామన్నారు.
ఒమర్ షాక్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఒమర్ అబ్దుల్లా మరో షాకిచ్చారు! అవసరమైతే తమ రైవల్ పార్టీ అయిన పీడీపీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఒమర్ చెప్పారు.
జార్ఖండ్ సీఎం ఎవరో..?
జార్ఖండ్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బుధవారం నిర్ణయించనుంది. బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ.. పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎమ్మెల్యేలు రేపు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ట్రైబల్ డామినేట్ అయిన జార్ఖండ్‌లో తొలిసారి నాన్ ట్రైబల్ సీఎం రావొచ్చునని అంటున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి రేసులో రఘుభర్ దాస్ మొదటి వరుసలో ఉన్నారు. ఇతను నాన్ ట్రైబల్ నేత. అతను బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఇతను 2009లో శిబూసోరెన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఓటమి చెందారు. ఆయన ట్రైబల్ నేత. ఈయన ఓటమి నేపథ్యంలో ప్రధానంగా రఘుభర్ పేరు వినిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications