'పెగాసస్ స్పిన్' బడ్జెట్; సామాన్యులకు ఇచ్చింది జీరో: కేంద్ర బడ్జెట్ పై మమతాబెనర్జీ ఫైర్
2022-23 కేంద్ర బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు నిరాశాజనకమైన బడ్జెట్ అని ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బడ్జెట్‌ను 'పెగాసస్ స్పిన్ బడ్జెట్' అని అభివర్ణించారు. బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు చేకూరింది ఏదీ లేదని, 'సున్నా' అని పేర్కొన్నారు.
ఇది పెగాసస్ స్పిన్ బడ్జెట్.. సామాన్యులకు సున్నా: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. నిరుద్యోగంతో మరియు ద్రవ్యోల్బణంతో నలిగిపోతున్న సామాన్య ప్రజలకు బడ్జెట్‌లో సున్నా మిగిలిందని పేర్కొన్నారు. మాటలే గొప్పగా చెప్పిన ప్రభుత్వం పేదల కోసం ఏం చేయాలో సూచించలేదని, పేదలకు మేలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పెగాసస్ స్పిన్ బడ్జెట్ అంటూ మమతాబెనర్జీ అభివర్ణించారు.

చేసిందేమీ లేదు .. కేవలం కేంద్రానివి పెద్ద చర్చలు మాత్రమే
మమతా బెనర్జీ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా ఎటువంటి ముఖ్యమైన పని ఏమీ చెయ్యలేదని, కేవలం పెద్ద చర్చలు మాత్రమే పెట్టిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్,ఉన్నత వర్గాల వారేఈ ప్రభుత్వానికి మంచి స్నేహితులని, మిగిలిన రైతులు, మధ్యతరగతి, రోజువారీ సంపాదకులు, నిరుద్యోగులుగురించి ఎవరూ పట్టించుకోరని, ఇదిప్రధానమంత్రినిర్లక్ష్య బడ్జెట్ 2022 అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ బడ్జెట్ తో ఎవరికీ లాభం లేదన్నారు. సత్యదూరం అయిన బడ్జెట్ అని అసహనం వ్యక్తం చేశా

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో, ఆ తర్వాత రాజ్యసభలో కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టారు.దిగువ సభలో బడ్జెట్‌ను సమర్పించిన సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా అంచనా వేయబడిందని చెప్పారు, ఇది అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే అత్యధికం అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యూనియన్ బడ్జెట్ 2022-23 రాబోయే 25 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థకు పునాది వేయాలని , ఇది వచ్చే ఇరవైఐదేళ్ళకు బ్లూప్రింట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని కూడా ఆమె చెప్పారు.
Recommended Video

సోమవారం మొదలైన బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో భాగం బడ్జెట్ సమావేశాలు మార్చి14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఇక నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకమైన బడ్జెట్ అని, ఈ బడ్జెట్ లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట దక్కలేదని, మొండి చెయ్యి చూపించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications