పెజావర మఠాధిపతి స్వామి విశ్వేశ్వతీర్థ కన్నుమూత.. ప్రధాని దిగ్భ్రాంతి..

కర్ణాటకలోని పెజావర మఠం అధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామిజీ(88) కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరతీర్థ డిసెంబర్‌ 20వ తేదీన బెంగళూరులోని కేఎంసీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో పరిస్థితి పూర్తిగా విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

మఠంలోనే తుది శ్వాస విడవాలన్న ఆయన చివరి కోరిక మేరకు లైఫ్‌ సపోర్ట్‌తో స్వామిజీని ఆదివారం ఉదయం ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన కన్నుమూశారు.

విశ్వేశ్వరతీర్థ మరణంపై ప్రధాని మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ట్విట్టర్ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి విశ్వేశ్వతీర్థ నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని చెప్పారు. ఇటీవల గురుపూర్ణిమ దినోత్సవం సందర్భంగా ఆయన్ను కలవడం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆయన అపార జ్ఞానం అలాగే నిలిచిపోతుందన్నారు.ఈ దు:ఖ సమయంలో ఆయన అనుచరగణం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

pejavara mutt chief vishweshwa teertha swami dies at 88

ఇక యడియూరప్ప తన ట్వీట్‌లో.. భగవాన్ కృష్ణ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ దు:ఖ సమయంలో విశ్వేశ్వర తీర్థ భక్తులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+