వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పు దొరకదని సంచులు కొద్దీ కొనేస్తున్న జనాలు .. ఎక్కడో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ తో ఉప్పు కొరత నెలకొంది. ఇక ముందు ముందు ఉప్పు దొరకదు . ఇప్పుడు రెండు నెలల పాటు ఉప్పుకి కూడా తిప్పలు. .. మార్కెట్లో ఉప్పు రాదు ఇలా జరుగుతున్న ప్రచారం దెబ్బకు జనాలు సంచుల కొద్దీ ఉప్పు కొనుగోలుపై దృష్టి పెట్టారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ? ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో... ఛత్తీస్ గడ్ లోని దాదాపు ప్రతి ప్రధాన జిల్లాలోని ప్రజలు ఇప్పుడు ఉప్పు కోసం వెంపర్లాడుతున్నారు . అన్ని పనులను వదిలి ఉప్పు కొనడం ప్రారంభించారు. మార్కెట్లో ఇక ఉప్పు కొనుగోళ్ళు , ఉప్పు కొరత వార్తలతో భారీగా పెంచేసిన ధరలు సంచలనంగా మారాయి.

ఏపీ తీరప్రాంత ఉప్పు రైతులకు ఈ ఏడాది కష్టమే: కరోనా లాక్ డౌన్ తో తీరని నష్టమే !!ఏపీ తీరప్రాంత ఉప్పు రైతులకు ఈ ఏడాది కష్టమే: కరోనా లాక్ డౌన్ తో తీరని నష్టమే !!

ఇక ఉప్పుపై పెరుగుతున్న వదంతుల నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఉప్పు దొరకదనే వదంతులు నమ్మవద్దని, ఉప్పు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రజలకు విజ్ఞప్తు చేస్తున్నారు అధికారులు . రాష్ట్రంలోని రేషన్ షాప్ మరియు మార్కెట్లో తగినంత ఉప్పు ఉందని పేర్కొన్నారు. రాయ్‌పూర్, రాజ్‌నందగావ్, ధమ్‌తారి, బలోద్‌లోని దుకాణాలలో కూడా ఉప్పు కోసం వచ్చే ప్రజలకు కూడా దుకాణాల వారు అవగాహన కల్పించాలని చెప్పారు . ఒకపక్క అధికారులు ఉప్పు కొరత లేదని చెప్తున్నా సరే ప్రజలు దుకాణాల నుండి ఎక్కువ ధరలకు ఉప్పు కొనడం కొనసాగించారు.

People are buying salt bags with the salt shortage rumors

ఇక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉప్పు ఎక్కువ ధరలకు విక్రయించిన రెండు షాపులను అధికారులు సీజ్ చేశారు. ఎవరూ ఇలాంటి వదంతులు నమ్మి అధిక ధరలకు ఉప్పు కొనుగోలు చెయ్యవద్దని చెప్పారు. ఉప్పు సమస్యపై ఛత్తీస్ గడ్ ప్రభుత్వం స్పందిస్తూ రాష్ట్రంలోని సుమారు 56 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ తక్కువ ధరలకు దుకాణాల ద్వారా ఉప్పు ఉచితంగా ఇస్తున్నారు. ధర పర్యవేక్షణ సెల్ మార్కెట్లో లభించే ఉప్పు స్టాక్ మరియు ధరను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లో ప్రతి నెలా 8000 టన్నుల నుండి 10 వేల టన్నుల వరకు ఉప్పు వస్తుందని ఆహార శాఖ అధికారులు తెలిపారు. ఇక ఉప్పు దొరకదు అన్న పుకార్లు నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తునారు.

English summary
Salt shortage with Corona lockdown. No more salt can be found before. There is no salt in the market. Where do you think this is? In the state of Chhattisgarh ... People in almost every major district of Chhattisgarh are now looking for salt. They started buying salt after leaving everything. With more salt purchases in the market and the news of a shortage of salt, prices that have been heavily inflated have become sensational.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X